Phone Tapping Case : ముగిసిన హరీష్‌రావు సిట్ విచారణ.. కాసేపట్లో మీడియా సమావేశం
- ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన హరీష్‌రావు సిట్ విచారణ
- ఏడు గంటల పాటు హరీష్‌రావును ప్రశ్నించిన సిట్
- కాసేపట్లో తెలంగాణ భవన్లో హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రత్యేక విచారణ బృందం (SIT) తన దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ కీలక నేత హరీష్‌రావును సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. హరీష్‌రావుపై వచ్చిన ఆరోపణలు, ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన అధికారుల వాంగ్మూలాల ఆధారంగా సిట్ అధికారులు విచారణ చేపట్టారు. సుమారు ఏడు గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన పాత్ర, ఇంటెలిజెన్స్ అధికారులతో ఉన్న సంబంధాలు, పార్టీ పరంగా జరిగిన పరిణామాలపై అధికారులు ఆయనను కూలంకషంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
హరీష్‌రావు విచారణ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నారు. విచారణ జరుగుతున్నంత సేపు స్టేషన్ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరగడంతో పోలీసులు వారిని చెదరగొట్టాల్సి వచ్చింది. విచారణ ముగిసిన అనంతరం జూబ్లీహిల్స్ పీఎస్ నుంచి బయటకు వచ్చిన హరీష్ రావు మాట్లాడుతూ.. ఇదంతా ట్రాష్ అని, డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమేనని విమర్శించారు. రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ తరుఫున న్యాయవాదిని కూడా అనుమతించలేదని ఆయన వెల్లడించారు. అయితే.. సిట్ విచారణ ముగిసిన హరీష్‌రావు తెలంగాణ భవన్‌కు బయలుదేరారు. విచారణలో తనను అడిగిన ప్రశ్నలు, దర్యాప్తు తీరు, ఈ కేసు వెనుక ఉన్న రాజకీయ పరిణామాలపై ఆయన కాసేపట్లో మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.
Also Read
- CM Revanth Reddy : హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళి.. రేపు విగ్రహావిష్కరణ.!
- CM Revanth Reddy : సీఎం రేవంత్‌కు కేరళలో ఘన గౌరవం.. ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్’ అవార్డు.!
- Ganesh Immersion 2026:10 వేల కెమెరాలు, డ్రోన్లు రంగంలోకి.. గణేశ్ నిమజ్జనంపై హైటెక్ నిఘా..
- Sword Dance : వినాయక నిమజ్జనంలో తల్వార్లతో యువకుల హల్చల్.. ఖమ్మంలో కలకలం.!
Asim Munir: పాకిస్తాన్ ఏ లక్ష్యం కోసం ఏర్పడిందో, అది ఇప్పుడు నెరవేరుతోంది..
తాజావార్తలు
-
World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027పై గంభీర్ మాస్టర్ ప్లాన్.. హార్దిక్, బుమ్రా కష్టమే..!
-
Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
-
CM Revanth Reddy : హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళి.. రేపు విగ్రహావిష్కరణ.!
-
High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
AP Govt: బిగ్ అలర్ట్.. అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మార్పు..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!