తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మాజీ ఎంపీ సంతోష్ రావును సిట్ (SIT) అధికారులు సుదీర్ఘంగా విచారించారు. సుమారు ఐదు గంటల పాటు సాగిన ఈ విచారణలో అధికారులు పలు కీలక అంశాలపై సంతోష్ రావును ప్రశ్నించినట్లు సమాచారం. విచారణలో భాగంగా సిట్ అధికారులు ప్రధానంగా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నియామకం చుట్టూ ప్రశ్నలను సంధించారు. ప్రభాకర్ రావును ఇంటెలిజెన్స్ విభాగం అధిపతిగా నియమించాలనే నిర్ణయం అసలు ఎవరిది? ఆ నిర్ణయం వెనుక ఎవరి ఒత్తిడి ఉంది? అనే కోణంలో సంతోష్ రావును ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ప్రభాకర్ రావుకు, సంతోష్ రావుకు ఉన్న సంబంధాలపై కూడా అధికారులు ఆరా తీసినట్లు సమాచారం.
Case Filed on Perni Nani: మాజీ మంత్రి పేర్ని నానికి బిగ్ షాక్.. ఈ సెక్షన్ల కింద కేసు నమోదు
కేవలం ప్రశ్నలకే పరిమితం కాకుండా, ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి గతంలో సేకరించిన కొన్ని సాంకేతిక ఆధారాలను సంతోష్ రావు ముందు ఉంచి సిట్ అధికారులు విచారణ జరిపారు. లభించిన డిజిటల్ డేటా, కాల్ రికార్డ్స్ , ఇతర కీలక డాక్యుమెంట్లను చూపిస్తూ ఆయనను ప్రశ్నించారు. ఈ ఆధారాలను చూసిన తర్వాత సంతోష్ రావు నుంచి వచ్చిన సమాధానాలను అధికారులు క్షుణ్ణంగా విశ్లేషిస్తున్నారు. ఐదు గంటల సుదీర్ఘ విచారణ అనంతరం సంతోష్ రావు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను అధికారులు అధికారికంగా రికార్డ్ చేశారు. ఆయన చెప్పిన విషయాలను వీడియో రూపంలో , రాతపూర్వకంగా భద్రపరిచారు. ఈ స్టేట్‌మెంట్ ఆధారంగా ఈ కేసులో మరికొందరిని విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
2026 T20 World Cup: బంగ్లాదేశ్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఐసీసీ.. దెబ్బ అదుర్స్ కదూ!
