తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మాజీ ఎంపీ సంతోష్ రావును సిట్ (SIT) అధికారులు సుదీర్ఘంగా విచారించారు. సుమారు ఐదు గంటల పాటు సాగిన ఈ విచారణలో అధికారులు పలు కీలక అంశాలపై సంతోష్ రావును ప్రశ్నించినట్లు సమాచారం. విచారణలో భాగంగా సిట్ అధికారులు ప్రధానంగా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నియామకం చుట్టూ ప్రశ్నలను సంధించారు. ప్రభాకర్ రావును ఇంటెలిజెన్స్ విభాగం…