హైదరాబాద్ నడిబొడ్డులోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అఘాయిత్యం, హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది… నిందితుడూ ఎంతకీ దొరకకపోవడంతో.. పోలీసులు విస్తృతంగా ప్రచారం చేశారు.. అన్ని జిల్లాలలను అప్రమత్తం చేశారు.. నిందితుడి చిత్రాలతో పాటు, ఊహా చిత్రాలను కూడా విడుదల చేసి అలర్ట్ చేశారు.. ఇక, నిందితుడికి మద్యం తాగే అలవాటు ఉండడంతో.. మద్యం షాపుల నిర్వహకులకు కూడా నిందితుడి ఫొటోలు పంపించి అలర్ట్ చేశారు.. అయితే, నిందితుడు రాజు పోలీసులకు చిక్కుండానే రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారని చెబుతున్నారు.. ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేసేవారు కూడా లేకపోలేదు.. ఈ నేపథ్యంలో చిన్నారిపై లైంగిక దాడి హత్య కేసులో నిందితుడిగా ఉన్న రాజు ఆత్మహత్య ఘటనపై విచారణ జరిపించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ లక్ష్మణ్.. ఈ కేసును అత్యవసరంగా విచారించాలని అభ్యర్థించారు.. ఇక, ఈ పిటిషన్‌పై ఇవాళ మధ్యాహ్నం రెండున్నర గంటలకు విచారించేందుకు ధర్మాసనం అనుమతించినట్టు తెలుస్తోంది.