Peddi Sudharshan Reddy: భాద్యతగల ఎంపీగా ఉండి బండిసంజయ్ సమాచారాన్ని పోలీసులకు ఇవ్వక పోవడం నేరమే అని కీలక వ్యాఖ్యలు చేశారు నర్సం పేట శాసన సభ్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డి. రాష్ట్రం లో పరీక్షల లీకేజీ వ్యవహారం లో బీజేపీ కుట్ర కోణం ఉందని మేము వ్యక్తం చేసిన అనుమానాలు నిజమయ్యాయని అన్నారు. కమలాపూర్ లో బీజేపీ కార్యకర్త ప్రోద్భలం తోనే పదో తరగతి హిందీ పేపర్ బయటకు వచ్చిందని ఆరోపించారు. బీజేపీ కార్యకర్త ప్రశాంత్ బయటకు తెచ్చిన ప్రశ్నా పత్రాన్ని బండి సంజయ్ కు వాట్సాప్ ద్వారా పంపించారని వ్యాఖ్యానించారు. బాధ్యత గల ఒక ఎంపీ గా ఉండి తనకొచ్చిన సమాచారాన్ని బండి సంజయ్ పోలీసులకు ఇవ్వక పోవడం నేరమే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ పై రాహుల్ తరహా లో లోక్ సభ స్పీకర్ అనర్హత వేటు వేయాల్సిందే అని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు పేపర్ లీకేజీ ను కావాలని సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కుట్రలను బహిర్గతం చేసేందుకు పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
Read also: Vetrimaaran: ఒప్పేసుకుంటున్నాం… ఒక కథ చెప్పాలి అంటే నీ తర్వాతే ఎవరైనా
హన్మకొండ జిల్లా కమలాపూర్‌లోని పరీక్షా కేంద్రం నుంచి మంగళవారం 10వ తరగతి హిందీ పేపర్‌ను బయటకు తీసుకొచ్చిన కేసులో ప్రధాన నిందితుడైన బీజేపీ కార్యకర్త బురం ప్రశాంత్ ప్రశ్నపత్రాన్ని వాట్సాప్ ద్వారా బండి సంజయ్ కి పంపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. సోమవారం కూడా బండి సంజయ్ ప్రశాంత్‌తో మాట్లాడినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. దీంతో పోలీసులు బండిని అదుపులోకి తీసుకున్నారు. 10వ తరగతి హిందీ ప్రశ్నపత్రం లీక్ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. పోలీసులు మంగళవారం అర్థరాత్రి కరీంనగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లి బండిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Peddi Sudarshan Reddy: బాధ్యతగల ఎంపీగా ఉండి సమాచారాన్ని పోలీసులకు ఇవ్వక పోవడం నేరమే..