Thatikonda Rajaiah:అభివృద్ధి కోసం పార్టీ మారిన కడియం.. స్టేషన్ ఘనపూర్ కు చేసిన అభివృద్ది గుండు సున్నా అని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. స్టేషన్ ఘనపూర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ.. తెలంగాణలో రాక్షస పాలన నడుస్తుందని తెలిపారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గుండాలను ఉసిగొల్పి దాడులు చేపిస్తున్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు. దాడిని ఖండిస్తున్నాం.. దాడి చేసిన గుండాలపై అరెస్టు చేసి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి అని చూడకుండా హరీష్ రావును అడవిలోకి తీసుకెళ్లడం దారుణమన్నారు. గత 10 సంవత్సరాలలో శాంతియుత పాలన జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ ది ప్రజాపాలన కాదు.. ప్రజలను హింసించే పాలన అని సంచలన వ్యాఖ్యలు చేశారు. లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయిందన్నారు.
Read also: Jagga Reddy: సీఎం రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుక కోస్తా..
పార్టీ ఫిరాయించిన వారిని రాళ్ళతో, కోడిగుడ్లతో కొట్టండని రేవంత్ రెడ్డే చెప్పారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆనాడు తెలంగాణ ఆకాంక్ష కొరకు ఎమ్మేల్యే పదవికి రాజీనామా చేసి, బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచానని తెలిపారు. నైతిక విలువలు, అభివృద్ధి అంటున్న కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా.. హైకోర్టు బెంచ్ కి, సుప్రీం కోర్టు కు వెళ్త అనడం సిగ్గుచేటన్నారు. దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలని తెలిపారు. దేవాదుల సృష్టికర్త అని చెప్పుకునే కడియం శ్రీహరి దొంగగా మారి 2008 లో నీటిని విడుదల చేసే లాకును నీటిలో వేయడం జరిగిందన్నారు. అభివృద్ధి కోసం పార్టీ మారిన కడియం.. స్టేషన్ ఘనపూర్ కు చేసిన అభివృద్ది గుండు సున్నా అన్నారు. గత పది ఏళ్లలో జరిగిన అభివృద్ధి తప్ప , కడియం శ్రీహరి కొత్తగా చేసింది ఏమీ లేదని అన్నారు.
Ponnam Prabhakar: ఆంధ్రోళ్ల పై కౌశిక్ రెడ్డి మాట్లాడిన వీడియోను కేటీఆర్ కు పంపుతా..