NTV Telugu Site icon

Revanth Reddy: కాంగ్రెస్‌ శ్రేణులకు రేవంత్‌రెడ్డి స్వీట్‌ వార్నింగ్..! శాశ్వత బహిష్కరణే..!

Revanth Reddy

Revanth Reddy

తెలంగాణలో పార్టీ బలోపేతంపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెడుతోంది కాంగ్రెస్‌ పార్టీ.. కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ నమోదులో పార్టీ కార్యకర్తలతో సత్తా చాటి.. పార్టీ అధిష్టానం దృష్టిని ఆకర్షించారు.. ఇక, తెలంగాణ రాజకీయాలపై దృష్టిసారించిన రాహుల్‌ గాంధీ.. మే నెలలో రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. అటు ఢిల్లీలో, ఇటు హైదరాబాద్‌లో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ.. ఐక్యంగా ముందుకు సాగాలని సూచిస్తున్నారు నేతలు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఉండాలని చెబుతున్నారు. అయితే, సోషల్‌ మీడియా వేదికగా కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులకు ఓ వార్నింగ్‌ ఇచ్చారు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి..

Read Also: KTR: టీఆర్ఎస్‌ ఆవిర్భావ వేడుకలు.. ఆహ్వానం ఉంటేనే రండి..

‘కాంగ్రెస్ కు ఐకమత్యమే మహాబలం’ అంటూ ట్వీట్‌ చేసిన రేవంత్‌రెడ్డి.. “అందుకు భిన్నంగా ఎవరైనా పార్టీ ముఖ్యుల పైన… వివిధ హోదాలలో ఉన్న నాయకుల పైన, బహిరంగంగా లేదా సోషల్ మీడియాలో విమర్శలు చేస్తే పార్టీ నుండి శాశ్వత బహిష్కరణ, క్రిమినల్ కేసులు ఎదుర్కోక తప్పదు..” అంటూ సున్నితంగా హెచ్చరించారు. ఇక, తన ట్వీట్‌ను కేసీ వేణుగోపాల్‌, మాణిక్యం ఠాగూర్‌, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, జానారెడ్డి, భట్టి విక్రమార్కకు ట్యాగ్‌ చేశారు రేవంత్‌రెడ్డి. కాగా, రాహుల్‌ గాంధీతో జరిగినే సమావేశంలో.. నేతల మధ్య ఎలాంటి విభేధాలు ఉండకూడదని.. అంతా కలిసి కట్టుగా పార్టీ కోసం పనిచేయాలంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.