Revanth Reddy: కేసీఆర్ అవినీతికి కంచె వేసి కాపాడుతోంది అమిత్‌షానే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాపై సంచలన ఆరోపణలు చేశారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి… అమిత్‌షా హోంమంత్రి లెక్క మాట్లాడలేదు.. చౌకబారు నేత లెక్క మాట్లాడారంటూ గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఫైర్ అయ్యారు. కేసీఆర్ దోపిడీ చేస్తే… హోం మంత్రిగా అమిత్ షా బాధ్యత మరచి మాట్లాడుతున్నారని విమర్శించారు. అసలు కేసీఆర్ అవినీతికి కంచే వేసి కాపాడుతుంది అమిత్ షానే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అని ప్రశ్నించిన ఆయన.. చర్యలు తీసుకునే అధికారం బీజేపీ చేతిలో ఉంది.. ఏం చేయకుండా మాటలు మాట్లాడుతుందన్నారు అని మండిపడ్డారు.
Read Also: Revanth Reddy: మే 21 నుంచి రైతు రచ్చ బండ..
Also Read
- Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
- Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
- Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
- Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
మరోవైపు… బీజేపీకి టీఆర్ఎస్ ప్రొటెస్ట్ మని ఇస్తుందని ఆరోపించారు రేవంత్‌రెడ్డి.. గుజరాత్ ఎన్నికలకు కూడా టీఆర్ఎస్ డబ్బులేనని ఆరోపించిన ఆయన.. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరుగుతున్నా… తెలంగాణ నుండే డబ్బులు వెళ్తున్నాయని వ్యాఖ్యానించారు. అందుకే కేసీఆర్‌ని అమిత్‌షా కాపాడుతున్నారని పేర్కొన్నారు.. ఇక, బీజేపీ సొంత పార్టీ నేతలపై కూడా సీబీఐ విచారణలు జరిపింది.. కానీ, కేసీఆర్ మీద అసలు ఏ కేసు పెట్టడం లేదని నిలదీశారు. సత్యాహరిచంద్రుడు.. కేసీఆర్ కవలపిల్లలా..? అని ఎద్దేవా చేసిన రేవంత్‌రెడ్డి.. ఈఎస్‌ఐ కుంభకోణం కేసు ఎనిమిదేళ్లుగా తొక్కి పెట్టింది బీజేపీయేనని మండిపడ్డారు. కేసీఆర్ మీద ఉన్న సీబీఐ కేసుల ఎందుకు తొక్కి పెట్టారని ప్రశ్నించారు. రెండు కేసులు… ఇప్పుడు దోచుకున్న సొమ్ముపై ఎందుకు విచారణ జరపలేదు అని బీజేపీ నేతలను ప్రశ్నించారు. కేసీఆర్‌ని బీజేపీ బొక్కలో వేయలేదు.. ఎందుకంటే కేసీఆర్ వేసే బొక్కల కోసం బీజేపీ చూస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!