Pawan Kalyan: మృగాళ్లకు అత్యాచారం ఆలోచనే రాకుండా శిక్షలు విధించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ పాతబస్తీలో మైనర్ బాలికపై అత్యాచార ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. అత్యాచారం ఆలోచనే రానివ్వకుండా నిందితులకు శిక్షలు విధించాల్సిన అవసరముందని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు, పాతబస్తీ అభాగ్యురాలిని అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. ఆడబిడ్డలపై అత్యాచారాలను నిరోధించడానికి ప్రస్తుతం అమలు చేస్తున్న శిక్షలే కాకుండా అటువంటి ఆలోచనలే మృగాళ్లకు రాకుండా సంస్కరణలు తీసుకు రావాలని అభిప్రాయపడ్డారు.
ఈ మధ్యకాలంలో ఏపీలో తరచూ అత్యాచార ఘోరాలు జరుగుతూనే ఉన్నాయని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. అల్లారుముద్దుగా పెంచుకునే బిడ్డలపై పరులెవ్వరైనా ఒక దెబ్బ వేస్తేనే తల్లిదండ్రులు అల్లాడిపోతారని.. అలాంటిది ఒక సమూహమే ఆ బాలికను చెరపడితే ఆ బాలికతో పాటు ఆమె తల్లిదండ్రులు ఎంత కుమిలిపోయి ఉంటారో ఊహించుకుంటేనే ఆవేదన కలుగుతోందని పవన్ కళ్యాణ్ తెలిపారు.
Also Read
- Hyderabad: పక్కా ప్లాన్‌తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలి గ్యాంగ్‌లు..
- Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
- DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
- Uttam Kumar Reddy: రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు.. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
అమ్నేషియా పబ్ రేప్ కేసులో పోలీసుల పరిశోధన చురుగ్గా సాగుతున్నప్పటికీ దోషులలో ఏ ఒక్కరూ తప్పించుకోకుండా ఈ పరిశోధనను ముందుకు తీసుకెళ్లాలని పవన్ ఆకాంక్షించారు. ముద్దాయిలు చిన్నవారైనా, పెద్దవారైనా, పలుకుబడి ఉన్నవారైనా పట్టుకుని చట్టం ముందు నిలబెట్టాలన్నారు. దోషులకు శిక్ష పడినంత మాత్రాన అత్యాచారానికి బలైన ఆ బాలికకు గానీ ఆమె కుటుంబానికి గానీ న్యాయం జరిగిందని భావించకూడదన్నారు. ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు ప్రభుత్వం చేయూతనివ్వాలని కోరారు. దోషుల కుటుంబాల నుంచి భారీగా నష్టపరిహారం రాబట్టి బాధితురాలికి అందచేయాలని పవన్ అన్నారు. బాధితురాలు నిలదొక్కుకుని సామాన్య జీవితం కొనసాగించడానికి మంత్రి కేటీఆర్ చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.
అత్యాచారం ఆలోచనే రానివ్వని శిక్షలు అవసరం – JanaSena Chief Sri @PawanKalyan pic.twitter.com/ZxinXi7B5d
— JanaSena Party (@JanaSenaParty) June 6, 2022
తాజావార్తలు
-
Hyderabad: పక్కా ప్లాన్‌తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలి గ్యాంగ్‌లు..
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
PBKS Captain Shreyas Iyer: చాలా బాధగా ఉంది.. మా విజయాన్ని ఆ ‘ఒక్కడు’ లాగేసుకున్నాడు!
-
Google Free Storage: గూగుల్ షాకింగ్ డెసిషన్.. ఫ్రీ స్టోరేజ్‌లో భారీ మార్పు.. కొత్త అకౌంట్లకు 5GB మాత్రమే!
-
Kerala: “ఇక కేరళలో చట్టాలను నిర్ణయించేది మేమే”.. ఊరేగింపులో రెచ్చిపోయిన ముస్లిం లీగ్ నేతలు..
ట్రెండింగ్
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!