హైదరాబాద్‌లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తెలంగాణ రాష్ట్ర విభజన సరైన పద్ధతిలో జరగలేదు అన్నానని, ప్రేమ తో విడిపోదాం అన్నానని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా.. తెలంగాణలో ఏపీకి చెందిన ప్రముఖుల విగ్రహాలపై జరుగుతున్న వాదనపై పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. గద్దరన్న విగ్రహం ఏపీలో పెట్టిస్తానని వ్యాఖ్యానించారు. దీంతోపాటు.. జనసేన తెలంగాణలో పోటీ చేస్తుందని ఆయన క్లారిటీ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు GHMC ఎన్నికల్లో ఒంటరిగా వెళ్తుంది అన్నారని, 2014 లో MP మల్కాజిగిరి నుంచి పోటీ చేసే అవకాశం ఉండిందని ఆయన తెలిపారు. కానీ.. నేను ఎంపీ అవడంకంటే.. తెలంగాణ అభివృద్ధి చెందడమే నాకు ఇష్టమని ఆయన అన్నారు. పదవుల కోసం చూడలేదు తెలంగాణ లో అని ఆయన అన్నారు.
Pawan Kalyan : గద్దరన్న విగ్రహం ఏపీలో పెట్టిస్తా
- తెలంగాణ విభజనపై మరోసారి స్పందించిన పవన్ కల్యాణ్
- గద్దర్ విగ్రహంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత
- తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని స్పష్టీకరణ
- పదవుల కంటే తెలంగాణ అభివృద్ధే ముఖ్యమన్న పవన్

Pawan Kalyan