Parliament Elections 2024: పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా, స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచిన ఈవీఎంలను కేంద్రాలకు తరలించి ఓట్లను లెక్కించనున్నారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్లో 14 టేబుళ్లు, నాగర్‌కర్నూల్ పార్లమెంట్లో 14 టేబుళ్లను ఏర్పాటు చేసి కౌంటింగ్ చేపట్టనున్నారు.
Read More: Akhanda 2 : అఖండ 2 లో ఆ సీనియర్ హీరోయిన్ కు ఛాన్స్..?
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో లోక్ సభ ఓట్ల లెక్కింపునకు అధికారులు కొన్ని నివేదికలు రూపొందించారు. అయితే..ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపడతారు. ఆ తర్వాత 8:30 నుంచి ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. దీంతో కౌంటింగ్ కేంద్రం వద్ద ఆయా జిల్లాల పోలీసుల ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో.. కౌంటింగ్ ఏర్పాట్లను మహబూబ్ నగర్ రిటర్నింగ్ అధికారి రవినాయక్, నాగర్ కర్నూల్ రిటర్నింగ్ అధికారి ఉదయ్ కుమార్ సోమవారం పరిశీలించారు. కాగా.. మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తం 31 మంది అభ్యర్థులు, నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో 19 మంది అభ్యర్థులు పోటీ చేశారు.
Read More: Telangana Lok Sabha Election: 34 కౌంటింగ్ కేంద్రాలు.. 12 టీమ్‌లతో సెక్యూరిటీ..
ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు వేర్వేరుగా ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. కాగా.. కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 282 పోలింగ్ కేంద్రాలకు 14 టేబుళ్లు, 21 రౌండ్లు, నారాయణపేటలో 270 పోలింగ్ కేంద్రాలకు 14 టేబుళ్లు, 20 రౌండ్లు, మహబూబ్ నగర్ లో 275 పోలింగ్ కేంద్రాలకు 14 టేబుళ్లు, 20 రౌండ్లు ఏర్పాటు చేశారు. జడ్చర్లలోని 274 పోలింగ్ కేంద్రాలకు 20 రౌండ్ల 14 టేబుళ్లు, దేవరకద్రలోని 289 పోలింగ్ కేంద్రాలకు 21 రౌండ్ల 14 టేబుళ్లు, మక్తల్‌లోని 284 పోలింగ్ కేంద్రాలకు 21 రౌండ్ల 14 టేబుళ్లు, షానగర్‌లోని 263 పోలింగ్ కేంద్రాలకు 14 టేబుళ్లు 19 రౌండ్ల వారిగా ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.
AP Election Results 2024 Live Updates: ఏపీ ఎన్నికల ఫలితాలు 2024 లైవ్ అప్డేట్స్..