Telangana Lok Sabha Election: తెలంగాణ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌కు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. 17 నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపును సులభతరం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 34 చోట్ల కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణలో 49 మంది పరిశీలకులు ఏర్పాటు చేయగా.. 2,440 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించింది ఎన్నికల సంఘం. వీరికి సాయం చేసేందుకు పది వేల మంది సిబ్బందిని ఈసీ నియమించింది. వీరితో పాటు మరికొందరిని కూడా అదనంగా నియమించారు. అవసరమైనప్పుడు వారి సేవలను కూడా వినియోగించుకుంటారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేశారు.
Read more: Astrology: జూన్ 04, మంగళవారం దినఫలాలు
తెలంగాణలో ఎక్కువ రౌండ్లు చొప్పదండి, దేవరకొండ యాకుత్‌పురాలో ఉంది. 24 రౌండ్లలో కౌంటింగ్ ఉంటుంది. ఆర్మూర్, అశ్వారావుపేట, భద్రాచలంలో అతి తక్కువగా ఉన్నాయి. ఈ కేంద్రాల్లో కేవలం 13 రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుంది. తెలంగాణలో ఈసారి మూడు లక్షల పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. వాటిని చేవెళ్ల, మల్కాజ్‌గురిలో లెక్కించారు. భద్రత విషయంలో ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రతి కేంద్రాన్ని సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్ నుంచి కౌంటింగ్ కేంద్రానికి తరలించే సమయంలో సీసీటీవీ పర్యవేక్షణ కూడా ఉంటుంది. అంతేకాకుండా భద్రత కోసం కేంద్ర బలగాల 12 బృందాలను ఏర్పాటు చేశారు.
Read more: Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమి తర్వాత ఆ పార్టీ గ్రాఫ్ పడిపోయింది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం పెరిగింది. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి మెజారిటీ సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్ సర్వేలు అంచనా వేస్తున్నాయి. తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ అభ్యర్థులతో కలిపి మొత్తం 525 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా మరియు పార్టీల వారీగా తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రత్యక్ష నవీకరణలు..

Telangana Lok Sabha