పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన కామెంట్లు ఉమ్మడి వరంగల్ జిల్లాలో చర్చకు దారి తీస్తున్నాయి దళిత బందు లబ్దిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పరకాల నియోజకవర్గంలో ఇవ్వను అన్నారాయన. ఆయన మాటలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో చర్చకు దారితీసింది. నడికుడిలో శనివారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దళిత బంధు వచ్చిన వాళ్ళుకి ఎవరికి కూడా ఈ దఫా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చే అవకాశం లేదని ఆయన సమావేశంలో స్పష్టం చేశారు.అదే విషయం ఈరోజు కామారెడ్డి పల్లె గ్రామంలో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ధర్మారెడ్డి మరో మారు ఈ విషయాన్ని ప్రస్తావించడంతో చర్చ జరుగుతుంది.
పరకాల నియోజకవర్గంలో ఎక్కువ మంది దళితులు ఉన్నారని దశల వారిగా వారి దళిత బంధు ఇస్తున్నాం అని చెప్పారు పరకాల ఎమ్మెల్యే.. దళిత బంధు తీసుకుంటే మాత్రం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మాత్రం రావని స్పష్టం చేశారు. దళిత బంధు వచ్చిన వారికి ఎవరికి కూడా డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వలేనన్నారు ఎమ్మెల్యే ధర్మారెడ్డి. బెడ్ రూమ్ ఇల్లు కావాలా? దళిత బంధు పథకం కావాలో మీరే తేల్చుకోండి? అని చెప్పారు.
ఈ కామెంట్స్ ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో చర్చకు దారితీశాయి. దళిత బంధు వచ్చిన వాళ్ళకి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రావా? డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వస్తే దళిత బంధు అవకాశం లేదా? అనే చర్చ ఉమ్మడి జిల్లాలో జోరుగా సాగుతుంది. ఎమ్మెల్యే మాత్రం అందరికీ ప్రభుత్వ పథకాలు అందాలంటే కచ్చితంగా ఈ నిబంధన పాటించక తప్పదంటున్నారు. మరి ఎవరు దళితబంధు కావాలంటారో, ఎవరు డబుల్ బెడ్ రూం ఇళ్ళకు ఒప్పుకుంటారో చూడాలంటున్నారు.
Read ALso: Suriya 42: పాన్ ఇండియా సినిమా షూటింగ్ మొదలుపెట్టిన సూర్య