ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ రోజు (జూలై 27, 2025) భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) పర్యటన జరగనుంది. పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల్లో ఈ పర్యటన జరుగుతుండటంతో, పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. ఈ పర్యటనలో కేటీఆర్ కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం, విగ్రహ ఆవిష్కరణ, మరియు కార్యకర్తల సమావేశాల్లో పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు, కేటీఆర్ లలిత కన్వెన్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన కుట్టు…
వరంగల్ జిల్లాలోని పరకాల నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలం పెంచికలపేట గ్రామంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సతీమణి జ్యోతి గడపగడపకు తిరిగి ఓట్లు అభ్యర్థించారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూడండి.. బీఆర్‌ఎస్‌ను గెలిపించి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని ఆమె కోరారు.
పరకాల సబ్ జైల్ నుంచి ఖైదీ పరారైన ఘటన సంచలనం రేపింది. ఇటీవల పోస్కో చట్టం నేర ఆరోపణతో ఏటూరునాగారానికి చెందిన మహమ్మద్ గౌస్ పాషాను పరకాల సబ్ జైలుకు తరలించారు.
మహిళలంతా భక్తి శ్రద్ధలతో బతుకమ్మ ఆడుతుండగా ఎమ్మెల్యే ధర్మారెడ్డి కారు బతుకమ్మల మీదుగా దూసుకెళ్లడం వివాదంగా మారింది. హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలకేంద్రంలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఆత్మకూరు వచ్చిన ఎమ్మెల్యే ధర్మారెడ్డి సెంట్రల్ లైటింగ్‌ను ప్రారంభించారు. ఆ సమయంలో వేణుగోపాలస్వామి దేవాలయం ఎదుట మహిళలు బతుకమ్మలు ఆడుకుంటున్నారు. ఎమ్మెల్యే వస్తున్నారని, రోడ్డుపై నుంచి బతుకమ్మలు తీసివేయాలని మహిళలను ధర్మారెడ్డి అనుచరులు చెప్పారు. మహిళలు కుదరదనడంతో.. వారిని తోసేసి బతుకమ్మల మీదుగా ఎమ్మెల్యే కారును పోనిచ్చారు.…