వీడిన పంజాగుట్ట బాలిక మృతి కేసు మిస్టరీ.. అసలు విషయం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంచలనం సృష్టించిన పంజాగుట్ట చిన్నారి హత్య కేసును ఛేదించారు పోలీసులు.. కన్న తల్లే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తేల్చారు.. హైదరాబాద్ పాత బస్తీకి చెందిన ఖాదర్ తో కలిసి కూతుర్ని హత్య చేసింది హీనా బేగం.. మద్యానికి బానిసై పిల్లలతో బెగ్గింగ్ చేయించారు.. ఢిల్లీ, ముంబై, జైపూర్ లో పిల్లలతో బెగ్గింగ్ చేశాయించారు ఖాదర్, హీన.. చిన్నారి బేబీ మెహక్.. నేను బెగ్గింగ్ చేయను అంటూ మారం చేసింది.. నేను నాన్న దగ్గరికి వెళ్తానంటూ గొడవ చేసింది.. దీంతో ప్రియుడు ఖాదర్‌తో కలిసి కన్న కూతురినే హీన దారుణంగా కొట్టి హత్య చేసినట్టు గుర్తించారు పోలీసులు.. ఇక, చిన్నారి మృతదేహాన్ని బెంగళూరు నుండి బస్సులో తీసుకొచ్చి హైదరాబాద్ తీసుకొచ్చి.. పంజాగుట్టలో వదలివెళ్లినట్టు తేల్చారు. దీంతో.. ఈ కేసు మిస్టరీని ఛేదించారు..
చిన్నారిపై మృతి కేసులో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్.. పూర్తి వివరాలను వెల్లడించారు.. బాలిక మృతికి కారణమైన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.. కన్న తల్లి, తన ప్రియుడితో కలిసి పాపను హత్య చేసినట్టు గుర్తించామన్న ఆయన.. రాజస్థాన్‌లోని అజ్మీర్ లో నిందితులైన తల్లి హీన బేగం, ప్రియుడు షేక్ మొహమ్మద్ ఖాదర్‌ను అరెస్ట్ చేసి తీసుకొచ్చినట్టు వెల్లడించారు.. ప్రియుడు ఖాదర్ ది డబీర్‌పురా, పాపా తల్లిది మియాపూర్ కాగా.. షేక్‌పేటలోని టెడ్డి కాంపౌండ్ వద్ద ఇద్దరికి పరిచయం ఏర్పడింది.. ఖాదర్ తో తన సమస్యలు చెప్పుకున్న హీనా బేగం చెప్పుకోవడం.. ఆయన ఓదర్చాడంతో.. క్రమంగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది.. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది.. పిల్లలను తీసుకుని ఇద్దరు ముంబై, ఢిల్లీ, జైపూర్, మనాలి వెళ్లారు.. అక్కడ పిల్లల చేత భిక్షాటన చేయించారు.. అయితే, చిన్నారి బేబీ మెహక్ బెగ్గింగ్ చెయ్యడం ఇష్టం లేక పోవడంతో ప్రతిఘటించింది.. నాన్న దగ్గరికి వెళ్తానని గొడవ చేయడంతో చిన్నారిని దారుణంగా కొట్టి హత్య చేశారు.. చిన్నారిని బెంగళూరు నుండి హైదరాబాద్ తీసుకు వచ్చి పంజాగుట్ట ద్వారాకపురి కాలనిలో ఓ షాపు వద్ద వదిలి వెళ్లిపోయారు.. ఇక, ఘటనా స్థలంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో కేసు ఛేదించడం కష్టంగా మారిందని.. అయినా ఛాలెంజ్‌కు తీసుకున్నామని తెలిపారు.. నిందితులు హైదరాబాద్ వస్తున్నారన్న సమాచారం మేరకు జూబ్లీ బస్టాప్ లో నిందితులను అరెస్ట్ చేశామని.. నిందితులు ఇద్దరిని రిమాండ్‌కు పంపుతామని తెలిపారు జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్.
Also Read
తాజావార్తలు
-
PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
-
Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
-
Tilak Varma: అతడు క్రీజులో ఉన్నంత సేపు సుస్సు పడింది.. ఓటమి తప్పదనుకున్నా: తిలక్ వర్మ
-
UPI Scam Alert : UPI ద్వారా డబ్బు పంపిన వెంటనే మోసపోయారా? మొదటి 30 నిమిషాల్లో ఏం చేస్తే నష్టం తగ్గే అవకాశం ఉంటుంది
-
Story Board : ప్రధాని మోడీ సక్సెస్ సీక్రెట్ ఏంటి? నెహ్రూ రికార్డు ఎలా బద్దలు కాబోతుంది?
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి