తెలంగాణలో అమ్మాయిలపై, మహిళలపై టీఆర్‌ఎస్ నేతలు ఆఘాయిత్యాలకు పాల్పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాల్వాయి రజిని కుమారి నిప్పులు చెరిగారు. మంగళవారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో అకృత్యాలు, ఆగడాలు, అమానుష ఘటనలు జరుగుతున్నాయని, టీఆర్‌ఎస్ నేతలు లైసెన్స్డ్ గుండాలు గా వ్యవహరిస్తున్నారని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. అమ్మాయిలు ఎలా కనిపిస్తున్నారు మీకు… భార్యలను తీసుకురమ్మని అంటున్న సిగ్గు శరం లేని నేతలు…