Padi Kaushik Reddy : కాంగ్రెస్ వ్యూహం లో పడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..?
- అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి వివాదం
- ఎథిక్స్ కమిటీకి రిఫర్
- కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆగ్రహం
- సభ్యత్వ రద్దు డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారశైలి ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. సభలో నిబంధనలను ఉల్లంఘిస్తూ, సీనియర్ సభ్యులను అవమానించేలా ప్రవర్తించారనే ఆరోపణలతో ప్రభుత్వం ఆయనపై కఠిన చర్యలకు సిద్ధమైంది. ముఖ్యంగా కౌశిక్ రెడ్డి బాడీ లాంగ్వేజ్ , సభలో ఆయన అనుసరించిన తీరుపై అధికార కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఈ వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీ (Ethics Committee) విచారణకు సిఫారసు చేసింది.
Aamir Khan: ‘నేను సినిమాలు చూడను’.. షాకింగ్ కామెంట్స్ చేసిన అమీర్ ఖాన్..
Also Read
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
- Alwal Case: అల్వాల్ మైనర్ బాలిక సామూహిక లైంగిక దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్..
అసెంబ్లీలో మైనింగ్ అక్రమాలపై చర్చ జరుగుతున్న సమయంలో కౌశిక్ రెడ్డి ప్రవర్తన అత్యుత్సాహంగా ఉందని ప్రభుత్వం గుర్తించింది. సీనియర్ నాయకులు కడియం శ్రీహరి మాట్లాడుతున్న సమయంలో, కౌశిక్ రెడ్డి తన చేతులతో తుపాకితో కాల్చేస్తున్నట్లు సైగలు చేస్తూ, అసభ్యకరమైన సంజ్ఞలు చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా సభలో పేర్కొన్నారు. ప్రతి చిన్న విషయానికి పోడియం దగ్గరికి రావడం, సభలో గందరగోళం సృష్టించడం ద్వారా సభా సంప్రదాయాలను కాలరాస్తున్నారని, అతని దూకుడుకు చెక్ పెట్టాల్సిన సమయం వచ్చిందని ప్రభుత్వం భావించింది.
MI Vs KKR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్.. తుది జట్లు ఇవే..
కౌశిక్ రెడ్డి తీరుపై కాంగ్రెస్ దళిత , గిరిజన ఎమ్మెల్యేలు తీవ్రంగా మండిపడ్డారు. కడియం శ్రీహరి వంటి 40 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ నేతను చంపుతామన్నట్లుగా సంజ్ఞలు చేయడం “గుండాగిరి” అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ , ఎమ్మెల్యే వేముల వీరేశం ధ్వజమెత్తారు. గతంలో కేవలం నిరసన తెలిపినందుకే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ల సభ్యత్వాలను బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు కౌశిక్ రెడ్డి సభ్యత్వాన్ని కూడా తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.
మొదట కౌశిక్ రెడ్డిని సభ నుంచి శాశ్వతంగా తొలగించాలని భావించినప్పటికీ, న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండటానికి ప్రభుత్వం నిబంధనల ప్రకారం ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. కౌశిక్ రెడ్డి ప్రవర్తనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని స్పీకర్ ఎథిక్స్ కమిటీని కోరారు. కౌశిక్ రెడ్డికి సంబంధించిన వీడియోలను ప్రభుత్వం ఇప్పటికే పరిశీలించింది , వాటిని కమిటీకి అందజేయనుంది. ఎథిక్స్ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా కౌశిక్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ప్రభుత్వం నిర్ణయించనుంది.
తాజావార్తలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?