Aamir Khan: ‘నేను సినిమాలు చూడను’.. షాకింగ్ కామెంట్స్ చేసిన అమీర్ ఖాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ తన గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. వందల కోట్ల వసూళ్లు సాధించే సినిమాలను రూపొందించే ఆయనకు, అసలు సినిమాలు చూసే అలవాటే లేదట. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమిర్, తను సినిమాల కంటే పుస్తకాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు.
ఆమిర్ ఖాన్ చిన్నతనం నుంచే చాలా క్రమశిక్షణ గల కుటుంబంలో పెరిగారు. ఆయన తల్లిదండ్రులు సినిమాల విషయంలో చాలా కఠినంగా ఉండేవారు. కేవలం దూరదర్శన్‌లో వచ్చే పాత బ్లాక్ అండ్ వైట్ చిత్రాలను తప్ప, రొమాంటిక్ లేదా కమర్షియల్ సినిమాలను చూడటానికి అనుమతించేవారు కాదు. దీనివల్ల ఆయనకు చిన్నతనం నుంచే పుస్తకాలతో విడదీయలేని అనుబంధం ఏర్పడింది. 18 ఏళ్లకే అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినీ రంగంలోకి అడుగుపెట్టినప్పటికీ.. సినిమాలు చూడటం కంటే తీయడమే ఆయనకు ఇష్టమట. ‘కొందరు ఫుట్‌బాల్ ఆడతారు, మరికొందరు చూస్తారు.. నేను ఆడే రకం’ అంటూ తన శైలిని చమత్కరించారు.
Also Read
- Mahendragiri Varahi: మహేంద్రగిరి వారాహి రివ్యూ..
- IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ప్రభుత్వం అలర్ట్! జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు..!
- IT Minister Sridhar Babu: రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలకు బిగ్ బూస్ట్.. కొత్త GCC పాలసీపై ఐటీ మంత్రి కీలక ప్రకటన
Also Read:Labour Laws: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి తగ్గనున్న జీతాలు..!
నిర్మాతగా బిజీ షెడ్యూల్..
తను సినిమాలు చూడకపోయినా, నిర్మాతగా ఆమిర్ ఖాన్ ప్రస్తుతం అత్యంత క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన నిర్మాణంలో రూపొందుతున్న కొన్ని ముఖ్యమైన చిత్రాలు ఇలా ఉన్నాయి.
ఏక్ దిన్: ఆమిర్ కుమారుడు జునైద్ ఖాన్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రం మే 1న విడుదల కానుంది. ఇది ఒక థాయ్ సినిమాకు రీమేక్‌గా ప్రచారం జరుగుతోంది.
లాహోర్ 1947: సన్నీ డియోల్, ప్రీతి జింటా ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ పీరియడ్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇది ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
హాలీవుడ్‌లో లేదా ప్రస్తుత ట్రెండ్‌లో ఏ సినిమాలు వస్తున్నాయో తనకు పెద్దగా తెలియదని, కేవలం అశోక్ కుమార్, దిలీప్ కుమార్ వంటి పాతతరం లెజెండ్స్ సినిమాలను మాత్రమే అప్పుడప్పుడు చూస్తుంటానని ఆమిర్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Soori: భారీగా పెరిగిన కమెడియన్ సూరి రెమ్యూనరేషన్.. రేంజ్ చూస్తే షాకవ్వాల్సిందే!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
Realme 16T 5G: 8000mAh బ్యాటరీతో అదరగొట్టే 5G ఫోన్.. 50MP కెమెరా, 144Hz డిస్‌ప్లే
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ప్రభుత్వం అలర్ట్! జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు..!
ట్రెండింగ్
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!