తెలంగాణలో ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వ విద్యాలయం 81వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 27న నిర్వహించనున్నట్టు ఉస్మానియా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి. రవీందర్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ గవర్నర్ డాక్టర్. తమిళిసై సౌందరరాజన్, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ జి. సతీష్ రెడ్డి, డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఆర్ అండ్ డీ ఛైర్మన్, డీఆర్‌డీఓ ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు.
అన్ని పీహెచ్‌డీ. డిగ్రీలు, PG/ M.Phil/ Ph.D బంగారు పతకాలు కాన్వొకేషన్‌లో అందజేస్తామన్నారు. జూలై, 2018 నుంచి జూన్, 2020 మధ్య పరీక్షలలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే పీహెచ్‌డీ డిగ్రీలు, బంగారు పతకాలు అందజేయనున్నట్టు తెలిపారు. 750 మందికి పట్టాలు, ఇందులో 350 మంది పండితుల పీహెచ్‌డీ పట్టాలు, 80 మందికి బంగారు పతకాలు అందజేస్తామన్నారు. నమోదు చేసుకున్న పీహెచ్‌డీ డిగ్రీ హోల్డర్లు, గోల్డ్ మెడల్ అవార్డు గ్రహీతలకు ఎంట్రీ పాస్, ఐడి కార్డు తప్పనిసరిగా తెచ్చుకోవాలన్నారు.