Online Trading Fraud: హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. రూ.లక్షకు లక్ష ఇస్తామంటూ 4000 వేల కోట్లలో వసూళ్లు చేసి మాక్స్ క్రిప్టో ట్రేడింగ్ సంస్థ చివరకు దుఖాణం ఎత్తేసింది. తక్కువ టైమ్‌లో ఎక్కువ ఆదాయం చూపిస్తామంటూ.. ట్రేడింగ్‌లో ఆరితేరాం.. ఊహకందని రిటర్న్స్ తీసుకొస్తామంటూ అమాయకులకు టోపి పెట్టింది. సంస్థ ప్రతినిధుల మాటలు నమ్మేసి భారీ పెట్టుబడులు పెట్టారు ప్రజలు. భారత దేశ వ్యాప్తంగా 25వేల మంది నుండి భారీ వసూలు చేసింది. 8 నెలల తరువాత కేటుగాళ్లు నట్టేట ముంచేశారు. మాక్స్ క్రిప్టో ట్రేడింగ్ ముసుగులో ఆన్ లైన్ ట్రేడింగ్ పేరుతో రాజేంద్రనగర్ లో కార్యాలయం ప్రారంభించారు. ప్రజలను ఆకట్టు కోవడానికి A/C హాల్స్ లో అదిరిపోయే మీటింగ్స్ పెట్టారు.
Read also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
ఈ సంవత్సరం రాజేంద్రనగర్ మైలార్ దేవిపల్లి దుర్గా కనెషన్ A/C హాల్స్ లో భారీ మీటింగ్ లు ఏర్పాటు చేశారు. మీటింగ్ కు వేలాది మంది హజరయ్యారు. లక్షకు లక్ష అంటూ అల్లా పేరుతో ఖాలేద్ హుసెన్, ఆమేర్ హుసెన్ సెంటిమెట్ మాటలు చెప్పారు. దుబాయ్ షేక్ లు తమ వెనుక ఉన్నారంటూ ప్రచారం చేశారు. డబ్బును బిట్కాయిన్, కాయిన్ రూపంలో మార్చి ఇస్తామంటూ హామీలు ఇచ్చారు. అల్లా సెంటిమెంట్ తో అమాయక ప్రజలు నమ్మేశారు. అమాయకులతో పెట్టుబడులు పెట్టించి, నిలువునా ముంచేసి కంపెనీ ఎత్తేశారు. ఏకంగా 25వేల మంది నుండి 4వేల కోట్ల రూపాయలు వసూలు చేశారు. సడెన్‌గా ఆఫీస్‌ను మూసేసి, రాత్రికి రాత్రే జంప్ అయిపోయారు. సడన్ గా యాప్ క్సోజ్ చేసేశారు. దీంతో వారికి కాల్ చేసిన లిప్ట్ చేయకపోవడంతో.. ఆఫీస్ వద్దకు వెళ్లిన ప్రజలు దిమ్మతిరిగే షాక్ తిన్నారు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు, వారి మాయ మాటలు నమ్మి కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టామంటూ లబోదిబోమన్నారు.
Read also:Bhakthi Tv Live: సోమవారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేయడం వల్ల జాతకంలో..
ఒకరికి రెండు సార్లు.. ఫోన్ చేస్తే మా వెనుక దుబాయ్ షేకులు ఉన్నారు. ఏమి చేసుకుంటారో చేసుకోండంటూ.. మేము దుబాయ్ లో ఉన్నామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. మైలార్ దేవిపల్లి దుర్గా కన్వేషన్ వద్ద ఆందోళకు దిగిన బాదితులు. వారి వద్ద డబ్బులు వసూల్ చేసిన ఎంజట్లను 100 మంది బాధితులు నిలదీసిన ఫలితం లేకుండా పోయింది. మద్య వర్తులు వారు ఎక్కడ ఉన్నారో తెలియదంటున్నారు. ఆగ్రహంతో బాధితులు మధ్య వర్తులపై దాడికి దిగారు. తమకు న్యాయం చేయాలంటూ ప్లే కార్డు ప్రదర్శించి నిరస చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోని న్యాయం చేయాలంటూ విన్నవించుకున్నారు. తమకు న్యాయం చేయాలని హైదరాబాద్ పోలీస్టేష్ కు చేరుకున్నారు. దుబాయ్ ఖాలేద్ హుసెన్, ఆమేర్ హుసెన్ పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరారు. తమ డబ్బులు తమకు ఇప్పించాలని వేడుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో బాధపడుతున్నామని రెక్కలు ముక్కలు చేసుకుని డబ్బులు కట్టామని ఇలా మోసపోతామని తెలియదని వాపోయారు.
Bhakthi Tv Live: సోమవారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేయడం వల్ల జాతకంలో..