NTV Telugu Site icon

Online scams: అత్యాశకు పోయాడు.. 12లక్షలు పోగొట్టుకున్నాడు

Online Scams

Online Scams

Online scams: ఆన్ లైన్ మోసాలకు మూల కారణం మనిషి అత్యాశ. మనం ఎంత ఆశ పడితే ఆన్ లైన్ లో అంత త్వరగా మోసపోతాం. దీన్ని పెట్టుబడిగా చేసుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చి పోతున్నారు. పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇస్తామంటూ అమాయకుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. మొదట వాట్సాప్, ఫేస్ బుక్, టెక్స్ట్ మెసేజెస్ చేస్తూ.. అమాయకులు ఆకర్షితులయ్యేలా చేస్తారు. పార్ట్ టైం జాబ్స్ పేరిట ఇంట్లో కూర్చుని రోజుకి 10,000 నుంచి 25,000 వేల వరకూ సంపాదించడంటూ మెస్సేజెస్ చేస్తారు. ఒక్కసారి మనం ఆ లింక్ ను క్లిక్ చేసినా, అందులో ఉన్న నెంబర్ కి ఫోన్ చేసినా ఇక మన పని అయిపపోనట్టే. ఇలా అత్యాశకు పోయిన ఓ వ్యక్తి 12 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

Read also: Gold Smuggling: రూ.2వేల కోసం రెండు కిలోల బంగారం స్మగ్లింగ్.. సరిహద్దులో పట్టుబడిన మహిళ

కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ ఆన్ లైన్ మోసం వెలుగుచూసింది. కామారెడ్డి జిల్లా జయశంకర్ కాలనీలో సందీప్ నివాసం ఉంటున్నాడు. వివిధ లోన్ యాప్ లలో 12 లక్షల రుణం తీసుకున్నాడు. అయితే.. మరో ఆన్ లైన్ అప్ లో 12 లక్షలు పెట్టుబడి పెట్టాడు సందీప్‌. ఆ వచ్చే డబ్బులతో రుణం తీర్చుకుందామని అనుకున్నాడు. కానీ అత్యాసకు పోతే నిరాసే మిగులుతుందని తేలింది. తను పెట్టుబడి పెట్టిన 12లక్షలు మాయమయ్యాయి. అవి తిరిగి అతనికి రాలేదు. దీంతో బాధితులు సందీప్‌ లబోదిబో మన్నాడు. ఇక వివిధ లోన్‌ యాప్‌ ల నుంచి తీసుకున్న 12లక్షల అప్పు చెల్లించాలని వేధింపులు మొదలయ్యాయి. మోసపోయానని గ్రహించిన సందీప్‌ పోలీసులను ఆశ్రయించాడు. కామారెడ్డి పట్టణ పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 12లక్షలు పోగొట్టుకున్నానని తన డబ్బులు ఎలాగైనా ఇప్పించాలని కోరాడు. అప్పులు చేసినా అంత డబ్బులు చెల్లించలేనని, తన కుటుంబానికి తనేదిక్కని వాపోయాడు. ఆన్‌ లైన్‌ వేధింపులు ఎక్కువయ్యాయని వాపోయాడు. ఆన్‌లైన్‌ మోసాలకు బలికావద్దని పోలీసులు సూచిస్తున్న అమాయకులు బలవుతున్నారని ఇప్పటికైనా ఆన్‌లైన్‌ మోసాలకు బానిసై మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
Poonch Terror Attack: పూంచ్ దాడిలో సంచలన విషయం.. ఉగ్రవాదులకు స్థానికుల సాయం..