Shamshabad airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో వరుసగా అక్రమ బంగారం పట్టుబడుతునే ఉంది. బంగారం అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు ఒ వైపు డిఆర్ఐ ఆధికారులు, మరో వైపు కస్టమ్స్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా బంగారం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటం లేదు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరో సారి విదేశీ బంగారం పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. సుధీర్ కుమార్ అనే ప్రయాణీకుడి వద్ద 47 లక్షల విలువ చేసే 827 గ్రాముల బంగారంను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.