NVSS Prabhakar: తెలంగాణ ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీకి బ్రహ్మరథం పట్టారని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. ప్రధాని రూ. 11 వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులు ప్రారంభించారు, ఇది కేసీఆర్ కు కంటగింపుగా ఉన్నట్లుంది, అందుకే కేసీఆర్ గైర్హాజరయ్యారని ఆరోపించారు. రాజకీయాలు వేరు.. అభివృద్ధి వేరని అన్నారు. రాజకీయ దుర్భుద్ధి కారణంగానే కేసీఆర్ మోడీకి స్వాగతం పలకలేదని, కనీసం అభివృద్ధి పనుల్లోనూ పాల్గొనలేదని దుయ్యబట్టారు. ఈ విషయంలో కేసీఆర్ తన తప్పు అయిందని ఒప్పుకుని చెంపలేసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Also: 50 years of Project Tiger: దేశంలో పులుల సంఖ్యని ప్రకటించిన ప్రధాని మోడీ..
ప్రధాని మోడీ వస్తే చాలు సీఎం కేసీఆర్ తప్పించుకు తిరుగుతన్నారని ఎద్దేవా చేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత నీచ స్థితికి దిగజారలేదని అన్నారు. మమత బెనర్జీ, స్టాలిన్, కేజ్రీవాల్, జగన్ సైతం విమర్శలు చేశారు.. కానీ అభివృద్ధి పనుల్లో ప్రారంభోత్సవాల్లో భాగస్వాములయ్యారని, వాళ్లను చూసి నేర్చుకోవాలని కేసీఆర్ కు సూచించారు. మోడీ సభ అనంతరం బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేశారు, కానీ కల్వకుంట్ల కుటుంబం ఎక్కడా కూడా మోడీని విమర్శించే ధైర్యం చేయలేదని అన్నారు. అలా చేస్తే మీది కుటుంబ పాలన అనేది స్పష్టం అవుతుందని ట్విట్టర్ కే పరిమితమయ్యారని విమర్శించారు. కేసీఆర్ ఆదేశానుసారం మంత్రులు, ఎమ్మెల్యేలు విమర్శలు చేశారు తప్పితే.. మనస్ఫూర్తిగా ఎవరూ విమర్శించలేదని అన్నారు.
బీఆర్ఎస్ నేతలు అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రశ్నించడం సిగ్గుచేటని, ఆజాంజాహీ మిల్స్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని హమీలు ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. కొత్త పరిశ్రమలను కూడా మూసేయించి ఆ భూములపై కేసీఆర్ బిడ్డ, కొడుకు కన్నేశారని ఆరోపించారు. విభజన హామీలు నెరవేరకుండా అడ్డుకుంటున్నది కేసీఆరే అని అన్నారు. కమ్యూనిస్టు పార్టీలు ఏనాడైనా లిక్కర్ కేసు, లీక్ కేసుపై మాట్లాడారా? అని ప్రశ్నించారు. కేంద్రం తెలంగాణపై చిన్నచూపు చూస్తోందని.. పక్క రాష్ట్రాలకు కేటాయించినన్ని నిధులు తెలంగాణకు కేటాయించడం లేదని విమర్శలు చేస్తున్నారని అలా అయితే తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లో తప్పితే ఇతర నియోజవర్గాల్లో ఎక్కడ అభివృద్ధి చేశారో చూపించాలని డిమాండ్ చేశారు.
