Formula E Race: ఫార్ములా-ఈ రేస్‌కు కోట్లలో చెల్లింపులు.. సీనియర్ IAS అరవింద్ కుమార్‌కు మెమో..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Formula E Race: తెలంగాణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్‌కు తెలంగాణ ప్రభుత్వం మెమో జారీ చేసింది. ఫార్ములా-ఇ రేస్ నిర్వహణపై వారంలోగా వివరణ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అరవింద్ కుమార్‌ను కోరింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్‌కు మెమో జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలో అరవింద్ కుమార్ మున్సిపల్ శాఖతో పాటు పలు కీలక శాఖల్లో పనిచేశారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అరవింద్ కుమార్ మున్సిపల్ శాఖ నుంచి విపత్తు నిర్వహణ విభాగానికి బదిలీ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ రేసుకు సంబంధించి అప్పటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి 10న హైదరాబాద్‌లో ఫార్ములా ఇ రేస్ పోటీలు జరగాల్సి ఉంది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రేస్ పై నిర్వాహకులు సానుకూలంగా స్పందించలేదు. ఫార్ములా ఈ రేస్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు గత వారం ప్రకటించారు.
Read also: Sexual Assault: 500 మంది అమ్మాయిలను వేధించిన ప్రొఫెసర్..
Also Read
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
అయితే, ఫార్ములా ఈ రేస్ 9,10వ సీజన్ల కోసం ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులు బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కాగా.. పార్మూలా ఈ రేస్ నిర్వహణకు గాను ప్రభుత్వ అనుమతి లేకుండానే హెచ్ఎండీఏ నుండి రూ. 50 కోట్లు బదిలీ చేశారని స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ కు కాంగ్రెస్ సర్కార్ మెమో జారీ చేసింది. వివరణ సంతృప్తికరంగా లేకుంటే అరవింద్ కుమార్ పై చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు. కాగా.. ఈ ఫార్ములా రేస్ నిర్వహణకు సంబంధించి హెచ్ఎండీఏకు రూ. 50 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధుల విడుదలకు ఎవరు అధికారం ఇచ్చారని మెమోలో ప్రశ్నించారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తప్పనిసరి. కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా నిధులు విడుదల చేసిందని అభిప్రాయపడ్డారు.
Read also: KA Paul: సీఈసీని కలిసిన కేఏ పాల్.. పోలింగ్ రోజే రిజల్ట్ కూడా ప్రకటించాలి..!
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు.. ఔటర్ రింగ్ రోడ్డు లీజుపై అప్పట్లో పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్‌కుమార్ రేవంత్‌రెడ్డికి లీగల్ నోటీసులు పంపారు. ఆ సమయంలో ఈ నోటీసులను వెనక్కి తీసుకోవాలని రేవంత్ రెడ్డి కోరారు. ఓఆర్ఆర్ లీజుకు సంబంధించి తాను అడిగిన సమాచారం ఇవ్వకుండా తాను ప్రస్తావించిన ఆరోపణలపై లీగల్ నోటీసులు జారీ చేయడాన్ని రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ ఫార్ములా రేసుకు సంబంధించి ప్రభుత్వం అరవింద్ కుమార్‌కు మెమో పంపింది.
Chlorine Gas Leak: ఉత్తరఖండ్‌లో క్లోరిన్ గ్యాస్ లీక్.. తప్పిన పెను ప్రమాదం!
తాజావార్తలు
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!