Bandi Sanjay: నోటీసులు, కేసులు, జైళ్లు నాకేమి కొత్త కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: నాకు నోటీస్ లు ఇస్తే స్వీకరించేందుకు సిద్దమన్నారు. బండి సంజయ్ కి నోటీసులు, కేసులు, జైళ్లు కొత్త కాదన్నారు. నేను సీఎం లాగా కుట్రలు చేయడం లేదన్నారు. కాలు విరిగింది అనో కరోనా వచ్చింది అనో తపించుకోనని అన్నారు. బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ఎంపీ అరవింద్ ఇంటికి వెళ్లి నిన్న జరిగిన ఘటనపై బండి సంజయ్ ఆరాతీశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణను అల్లకల్లోలం చేయాలని చూస్తున్నారని బండిసంజయ్ ఆరోపించారు. రాజకీయాల కోసం కేసీఅర్ సొంత బిడ్డను పావుగా వాడుకుంటున్నారు అంటూ నిప్పుటు చెరిగారు. కేసీఅర్ కుటుంబాన్ని తెలంగాణ పొలిమేర నుంచి తరిమికొట్టేందుకు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నారపి అన్నారు.
Read also: Bangladesh: శ్రద్ధా హత్య తరహాలోనే హిందూ యువతిని చంపి, ముక్కలు చేసిన లవర్
Also Read
- Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్లకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు గడువు.!
- Lal Darwaza Rangam : లాల్ దర్వాజా రంగంలో భవిష్యవాణి.. ‘భయపడొద్దు’ అన్న మహంకాళి..!
- Bhatti Vikramarka : తెలంగాణకు బ్యాటరీ బూస్ట్.. క్వాంటమ్స్కేప్కు భట్టి ఆహ్వానం..!
- CRS Portal : హైదరాబాద్‌లో గుడ్‌న్యూస్.. ఇక ఇంటి నుంచే బర్త్, డెత్ సర్టిఫికెట్లు
ముఖ్యమంత్రి కేసీఅర్ తక్షణమే ఘటనపై స్పందించాలని డిమాండ్ చేశారు. కేసీఅర్ కుటుంబంలో అంతర్గత ఘర్షణలు ప్రారంభమయ్యాయని అని ఆరోపించారు. కేసీఅర్ ముఖ్యమంత్రి, తండ్రిగా విఫలమయ్యారని తీవ్ర విమర్శలు చేశారు బండి సంజయ్. అమిత్ షా దృష్టికి దాడి ఘటనను తీసుకెళ్లామని, రాష్ట్ర ముఖ్యమంత్రి కుట్రను నమ్ముకున్నారు… మేము చట్టాన్ని నమ్ముకున్నామన్నారు. ప్రాణాలు పోతే నువ్వు ఇస్తావా? నీ అయ్య ఇస్తాడా? అంటూ ఎమ్మెల్సీ కవితపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు సహకారంతో టీఆర్ఎస్ కిరాయి గుండాలు విచక్షణ రహితంగా దాడి చేశారని ఆరోపించారు. సీఎం కుటుంబ అహంకారాన్ని తెలంగాణ ప్రజలు చేశారని అన్నారు. అరవింద్ నాన అదృష్టవశాత్తూ ఇక్కడ లేరు ఉంటే పరిస్థితి ఏంది.. ప్రమాదం తప్పిందని అన్నారు. హోమో ఫోబియాలో కుటుంబం ఉందని, పోయే కాలం దగ్గర పడ్డదని, ఆ కుటుంబంకి అర్థం అయిందని బండి సంజయ్ అన్నారు. హిందువులు పవిత్రంగా భావించే లక్ష్మి, తులసి, దుర్గ దేవిల ఫోటోల మీద దాడి చేశారన్నారు. హిందువులు అయితే దేవుళ్ళపై దాడి చేయరని మండిపడ్డారు. దేవుళ్ళ మీద దాడి చేసినందుకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Read also: Sandhya Devanathan: మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ గురించి ఈ విషయాలు తెలుసా?
తెలంగాణ సమాజం ఆలోచించాలని, దాడులు భరిద్దామా? అంటూ ప్రశ్నించారు. సెంటిమెంట్ క్రియేట్ చేద్దామని అనుకున్నారు కానీ కుదరలేదని ఎద్దేవ చేశారు. మహిళల మీద రాయి విసిరారని, అరవింద్ ఆరోపణ వాస్తవం అని తెలంగాణ సమాజం గ్రహిస్తుందని అన్నారు. ప్రాణాలు పోతే నువ్వు ఇస్తావా? నీ అయ్య ఇస్తాడా? అంటూ ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించారు. శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుందని మండిపడ్డారు. ఇళ్ళ మీద దాడులు చేయడం మంచి పద్దతి కాదని హెచ్చరించారు. మహిళల గురించి మాట్లాడే హక్కు కవితకు లేదని అన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా విమర్శలు చేయాలి తప్పితే.. దాడి చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లపై దాడులు చేయడం మంచిది కాదు, కుటుంసభ్యులకు రాజకీయాలతో ఏమీ సంబంధం? అంటూ ప్రశ్నించారు. ఇంట్లో వృద్దులు, చిన్న పిల్లలు ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? ప్రాణాలు పోతే ఎవరూ బాధ్యులు? అంటూ ప్రశ్నలతో ముంచెత్తారు.
తాజావార్తలు
-
CGST Superintendent: రూ.50 వేలు లంచం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ సీజీఎస్టీ (CGST) సూపరింటెండెంట్..
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్లకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు గడువు.!
-
Milky Mist Founder: 16 ఏళ్లకే చదువు మానేసి పనీర్ అమ్ముతూ.. రూ.10 వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడు! ఎవరీ సతీష్ కుమార్?
-
ICC: క్రికెట్ ప్రపంచంలో ఐసీసీకి ఊహించని షాక్.. తిరగబడ్డ రెండు దేశాలు..
-
Lal Darwaza Rangam : లాల్ దర్వాజా రంగంలో భవిష్యవాణి.. ‘భయపడొద్దు’ అన్న మహంకాళి..!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!