No Drinking Water In Railway Stations: రైల్వే ‘స్వజల్’ ఏదీ..? దాహార్తితో ప్రయాణికులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుక్కెడు మంచినీటి కోసం ప్రయాణికులు ముప్పు తిప్పలు పడే పరిస్థితి. నీరు కావాలంటే వున్న రేటుకంటే ఎక్కువ మోతాదులో చెల్లించాల్సి వస్తోంది. బాటిల్ రూ.20 అయితే దానికి అదనంగా రూ.25 లేదా 30 చెల్లించి నీరు తాగే దుస్థితి ప్రయాణికులు ఎదుర్కొంటున్నారు. పేద ప్రజల ప్రయాణ అవసరాలను తక్కువ ధరల్లోనే తీర్చే రైల్వేష్టేషన్లలో తిప్పలు తప్పడం లేదు. అయితే.. ప్రతి ప్లాట్‌ఫామ్‌పై తక్కువ ధరకే తాగునీరు అందించే ఐఆర్‌సీటీసీ ‘స్వజల్’ ఆర్‌వో ప్లాంట్‌లు మూతపడటం వల్ల జనం దాహార్తితో అలమటిస్తున్నారు. బయటి దుకాణాల్లో లీటరు నీళ్ల సీసాకు పది రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. స్వజల్ ప్లాంట్‌లో లీటర్ బాటిల్ ఐదు రూపాయలకే అందించేవారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని స్టేషన్లలోనూ తాగునీరు కరవైంది.
అయితే.. ఒక రైలులో 24 బోగీలుంటాయి, 12 వరకు స్లీపర్‌క్లాస్, 2 జనరల్ క్లాస్ మిగతావి ఏసీవి అన్నమాట. అంటే సామాన్య ప్రయాణికులే ఎక్కువ మంది రైలెక్కుతారు. స్టేషన్లలో సేవలు మాత్రం ప్రియమయ్యాయి. తిందామంటే తిండి దొరకదు.. దాహమేసినా నీరు దొరకని దుస్థితి. రైల్వే ఆధ్వర్యంలో ఐఆర్‌సీటీసీ నడిపించే ‘జనాహార్’ హోటళ్లు బంద్ అవడంతో ఫుడ్‌కోర్టులకు వెళ్లలేక.. ఆకలితోనే ప్రయాణించాల్సిన పరిస్థితి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఏర్పడింది. కరోనా కాలంలో మూతపడిన క్యాంటీన్లను తర్వాత తెరిచినా.. వాటి కాలపరిమితి అయిపోయిందంటూ కొన్ని స్టేషన్లలో మూతవేస్తే.. నగరంలోని సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లలో జనాహారమే దొరకని పరిస్థితి, ఒకప్పుడు అన్నిస్టేషన్లలో ప్రతి ప్లాట్‌ఫామ్ మీద ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో.. ‘స్వజల్’ పేరిట ఆర్‌వో ప్లాంట్లుండేవి. అయితే.. కరోనా నేపథ్యంలో ఇవన్నీ మూతపడటంతో.. తర్వాత దీన్ని పట్టించుకునేవారే కరవయ్యారు.
Also Read
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్‌వేర్
- Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
- CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
read laso: West Bengal SSC Scam: కాల్ చేసిన స్పందించని దీదీ.. చేసేదేమిలేక ఈడీ వెంట చటర్జీ
తెలంగాణ రాష్ట్రంలో.. సికింద్రాబాద్ స్టేషన్ పేరుకే ఏ1 స్టేషన్‌గా గుర్తింపు పొందింది. కరోనా సాకుతో ‘జనాహార్’ క్యాంటిన్ బంద్ అయి మూడేళ్లయ్యింది. ఫుడ్ ట్రాక్ సామాన్యుడి జేబు గుల్ల చేస్తున్నాయి. విజయవాడలోనూ స్టేషన్ అభివృద్ధి పనుల పేరుతో 6, 7 ప్లాట్‌ఫామ్‌లపై ఉన్న క్యాంటీన్లను మూసేసారు. ఈస్ట్ కోస్టు పరిధిలో ఉన్న విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో జనాహార్ క్యాంటిన్ నడుస్తోంది. ఇందులో 20 రూపాయలకే జనతాఖానా దొరుకుతుంది. ప్రతి ప్రయాణికుడికి అందుబాటులో 20 రకాల ఆహారాలను అందిస్తున్నారు. ఇలాంటి వాతావరణం సికింద్రాబాద్ స్టేషన్లో ఎందుకు లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఈనేపథ్యంలో.. రైల్వే అధికారులకు సామాన్య ప్రయాణికుల గోడు ఎందుకు పట్టడంలేదని, వ్యాపార ధోరణి తప్ప సేవామార్గం రైల్వేలో కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
‘స్వజల్’ పథకం ఎప్పుడు..?
అయితే.. గ్రామీణ తాగునీటి సరఫరా పథకాల విజయం , సుస్థిరత కోసం ”స్వజల్” పథకం ఫిబ్రవరి 2018లో బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ , ఉత్తరాఖండ్ ఆరు రాష్ట్రాల్లో పైలట్ పథకంగా ప్రారంభించబడింది. 28 రాష్ట్రాలలో విస్తరించి ఉన్న 117 ఆకాంక్ష జిల్లాలకు ఈ పథకం విస్తరించబడింది. ఈ జిల్లాలు జాతీయ సగటు 44% నుండి పైప్డ్ వాటర్ సప్లై (PWS) నివాసాలలో 25% మాత్రమే ఉన్నాయి. దీంతో ఈ జిల్లాల్లో స్వజల్ ద్వారా పీడబ్ల్యూఎస్ విస్తరణకు పెద్దపీట వేసింది. అయితే ఇప్పుడు ఈపథకం కనుమరుగైపోయింది. దీన్ని పట్టించుకునే నాధుడే కరువయ్యారంటూ విమర్శనలు వస్తున్నాయి.
తాజావార్తలు
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్‌వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
-
Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..