Nizamabad CI Arrest: పంజాగుట్ట యాక్సిడెంట్ కేసులో ట్విస్ట్.. నిజామాబాద్ సీఐ ప్రేమ్ కుమార్ అరెస్ట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nizamabad CI Arrest: మద్యం మత్తులో రోడ్డు ప్రమాదానికి కారణమైన యువకుడిని నిర్దోషిగా విడుదల చేసిన కేసు రోజుకో మలుపులు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో నిజామాబాద్ సీఐని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన హిట్ అండ్ రన్ కేసులో మరో ఇద్దరిని పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో నిజామాబాద్ ఇన్ స్పెక్టర్ ప్రేమ్ కుమార్, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అనుచరుడు అబ్దుల్ వాహే ఉన్నారు. నిందితుడు సాహిల్ తప్పించుకోవడంలో వీరిద్దరూ కీలకపాత్ర పోషించినట్లు భావిస్తున్నారు. తాజా అరెస్టులతో ఈ కేసులో నిందితుల సంఖ్య ఎనిమిదికి చేరింది. రోడ్డు ప్రమాదం తర్వాత దుబాయ్‌కు పారిపోయిన ప్రధాన నిందితుడు సాహిల్, అతని తండ్రి మాజీ ఎమ్మెల్యే షకీల్ కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. విద్యాశాఖ ఇన్ స్పెక్టర్ గా పనిచేసిన ప్రేమ్ కుమార్ ఇటీవల నిజామాబాద్ కు బదిలీపై వచ్చారు. విధుల్లో చేరాల్సిన ప్రేమ్‌కుమార్‌ను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. డిసెంబరు 23వ తేదీ అర్ధరాత్రి మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ అలియాస్ రాహిల్ బేగంపేటలోని ప్రజాభవన్ వద్ద బీహెచ్‌డబ్ల్యూ కారును అతి వేగంతో నడుపుతూ ట్రాఫిక్ డివైడర్లను ఢీకొట్టాడు.
Read also: Tummala: సత్తుపల్లిలో ఫుడ్ ఫార్క్.. ఫిబ్రవరిలో ప్రారంభించేది ఆయనే..
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత ఈ కేసులో అసలు నిందితుడిని విడుదల చేశారు. ప్రమాదానికి మహారాష్ట్రకు చెందిన డ్రైవర్ అబ్దుల్ ఆసిఫ్ కారణమని పంజాగుట్టలో కేసు నమోదైంది. నిజామాబాద్ సీఐ పంజాగుట్ట ఇన్ స్పెక్టర్ దుర్గారావుతో ఫోన్ లో మాట్లాడి కేసు తారుమారు చేసేందుకు సహకరించినట్లు విచారణలో తేలింది. స్టేషన్ నుంచి సాహిల్‌ను విడిపించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. నిందితుల సెల్‌ఫోన్లలో లభించిన కాల్ డేటా ఆధారంగా ఇన్‌స్పెక్టర్ ప్రేమ్‌కుమార్‌తో పాటు మరో ఇద్దరితో షకీల్ మాట్లాడినట్లు ఆధారాలు లభించాయి. ఈ కేసులో జోక్యం చేసుకున్నారనే అనుమానంతో ప్రేమ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన సాహిల్‌ను ముంబైకి పంపడంలో షకీల్ అనుచరుడు అబ్దుల్‌వాహే ప్రమేయం ఉన్నట్లు తేలింది. నిందితులను విడిచిపెట్టిన ఇన్ స్పెక్టర్ దుర్గారావుపై కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. అసలు నిందితుడిపై కాకుండా మరొకరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
Bandi sanjay: కేటీఆర్ ని బీఆర్ఎస్ పార్టీ నే పట్టించుకునే పరిస్థితి లేదు.. బండి కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!