Minister Seethakka: నిర్మల్ జిల్లా కలెక్టర్ పై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేసింది. నాయక్ పోడులు అంటే నిర్మల్ జిల్లా కలెక్టర్ కు తెలియకపోవడం బాధాకరం అన్నారు. అధికారిగా ఉన్నప్పుడు వాళ్లు అన్ని తెలుసుకోవాలని సూచించింది. ఏ కులం, ఏ రిజర్వేషన్ వస్తదో తెలియకపోవడం వారి తప్పు.. రాజ్యంగాన్ని చదవాలని తెలిపింది. ఏ కులం వారికి ఏ ఏ రిజర్వేషన్లు, ఏం హక్కులు ఉన్నాయే తెలుసుకోని వాటిని అమలు చేయాలని చెప్పుకొచ్చింది. ఇలాంటి సమస్య ఎక్కడెక్కడా ఉందో నా దృష్టికి తీసుకురండీ.. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా సర్టిఫికెట్ల సమస్య పరిష్కరించేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లకు లెటర్లు పంపిస్తామని మంత్రి సీతక్క వెల్లడించింది.
Read Also: Rain Alert In TG: తెలంగాణకు వర్ష సూచన.. రాబోయే నాలుగు రోజుల పాటు వానలే వానలు..
అయితే, నాయక్ పోడ్ వారికి ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా చూస్తామని మంత్రి సీతక్క చెప్పుకొచ్చింది. ముఖ్యంగా పేదల పక్షాన ఈ ప్రభుత్వం నిలపడుతుంది.. పోడు భూముల సమస్యను ప్రభుత్వంతో మాట్లాడి.. నెరవేరే విధంగా చూస్తాను అని తెలిపింది. ఇందిరమ్మ ఇండ్లలో ప్రత్యేకంగా కొన్ని ఇళ్లు నాయక్ పోడ్లకు అందించేలా మంత్రితో మాట్లాడతాను అని పేర్కొనింది. అలాగే, జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి కుల ధ్రువీకరణ పత్రం వచ్చే విధంగా చూస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చింది.
Read Also: Aadhaar: ఆధార్ కార్డు ఉచిత అప్‌డేట్‌కు ఇంకా కొన్ని రోజులే ఛాన్స్.. త్వరగా చేసుకోండి
ఇక, ఆదివాసీల త్యాగాలు ఎక్కువ.. ఫలాలు తక్కువ అని మంత్రి సీతక్క తెలిపింది. గిరిజన ప్రాంతాలలో నీరు ఉన్నా.. కానీ, ఆదివాసీలకు ప్రయోజనం లేదు అన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఆదివాసీల ఉన్నారు.. ఆదివాసీలకు ప్రత్యేక గుర్తింపు లేక నిధులు ఏర్పాటు చేయలేక పోతున్నారు.. జాతి, కులగణన లేనప్పుడు ప్రత్యేక నిధులు కేటాయించడం సాధ్యం కాదని వెల్లడించింది. ఆందరి కులాల దేవుళ్లను గౌరవిద్దాం.. అంతిమంగా మన జాతికి ఉన్న సాంస్కృతిక కార్యక్రమాలను కాపాడుకుందాం.. జాతి గుర్తింపు ఉండాలంటే వేషధారణ ముఖ్యం అని సూచించింది. ములుగు లాంటి ప్రాంతాలలో కాకతీయుల కాలంలో భాష మారింది అని సీతక్క చెప్పింది.
