Nirmal Handicrafts: నిర్మల్ కోయ బొమ్మలు ప్రపంచ వ్యాప్తంగా చేరుతున్నాయి. ఆన్‌లైన్ దిగ్గజం అమెజాన్‌లో ఈ బొమ్మలను అందుబాటులో ఉంచేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. దీంతో కోయ బొమ్మలు తయారు చేస్తున్న వారికి ఈ రూపంలో ఓ భరోసా లభించింది. అయితే.. అటువంటి ప్రసిద్ధ కళాఖండాలను రూపొందించడానికి కర్రలు కొరతగా మారుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో లభించే పోనికి కర్ర, చింత గింజల పొడితో ఈ కళాఖండాలను తయారుచేస్తున్నారని, అయితే అడవుల్లో ఈ చెట్లు తగ్గిపోవడంతో ప్రస్తుతం కర్ర అందుబాటులో లేదని స్థానిక కళాకారులు చెబుతున్నారు. కొన్నిసార్లు వారే స్వయంగా అడవుల్లో చెట్లను వెతికి అటవీశాఖ సమాచారం ఇచ్చి టెండర్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు.
Read also: Ladakh : నాలుగు డిమాండ్లతో లడఖ్ లో రోడ్లపైకి వచ్చిన వేలాదిమంది జనాలు
అటవీ మైదానంలో ప్లాంటేషన్ ద్వారా డిమాండ్ ఉన్న చెరుకును పెంచేందుకు అటవీశాఖ మూడేళ్ల క్రితమే కసరత్తు ప్రారంభించింది. నిర్మల్ జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అటవీ శాఖ సీసీఎఫ్ శరవణన్ పోని చెట్లను పెంచేందుకు కృషి చేస్తున్నారు. ఇంత చరిత్ర కలిగిన చెక్క బొమ్మల తయారీ కేంద్రం పరిస్థితి భవిష్యత్తులో ప్రశ్నార్థకంగా మారనుందని స్థానిక చేతివృత్తుల వారు వాపోతున్నారు. పరిస్థితిని తట్టుకుని నిలబడలేకపోతున్నారు. ఎలాంటి యంత్రాలు వాడకుండా కేవలం చేతితో చేసే కళా వృత్తి తమ చేతుల్లో ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలు ఈ వృత్తిని నేర్చుకోలేకపోతున్నారని, ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నరని, ఈ వృత్తి తాము ఉన్నంత వరకే సాగుతుందేమోనని భయపడుతున్నారు. గతంలో దాదాపు 200కు పైగా కుటుంబాలు ఈ వృత్తిని చేపట్టేవారని, ఇప్పుడు అది పదుల సంఖ్యలో చేరిందన్నారు. ఇలాగే కొనసాగితే మరో 10 నుంచి 15 ఏళ్ల పాటు ఈ వృత్తి కొనసాగే అవకాశం ఉంది.
Read also: CM Revanth Reddy With Chiranjeevi: చిరంజీవి విందులో సీఎం రేవంత్ రెడ్డి.. ఫోటోలు వైరల్..!
17వ శతాబ్దంలో నిర్మల్ రాజ్యాన్ని పరిపాలించిన నిర్మల నాయుడు దేశం నలుమూలల నుండి అనేక మంది కళాకారులను రప్పించి రాజ్యంలో అనేక స్థానిక నిర్మాణాలు చేయగా అందులో నకశీలలు భాగమయ్యారు. ఈ నకాషి కులానికి చెందిన వారు స్థానికంగా లభించే పోనికి కర్రతో వివిధ కళాఖండాలను తయారు చేస్తారు. నిమ్మల రాజు ఈ శిథిలాలను చూసి మంత్రముగ్ధుడై వాటికి కావాల్సిన ఏర్పాట్లు చేశాడు. అప్పటి నుండి వారి హస్తకళ వివిధ ప్రాంతాలకు విస్తరించింది.. 1955 లో కళాఖండాలను వివిధ ప్రాంతాలకు పంపి ఉపాధి పొందేందుకు ఒక పారిశ్రామిక సంఘం ఏర్పడింది. అయితే..ఇప్పుడు 400 ఏళ్లనాటి కోయ బొమ్మల తయారీ పరిశ్రమకు ఆదరణ లేక కుంటుపడుతుందని స్థానిక కళాకారులు వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
IAS Amrapali: ఐఏఎస్ అమ్రపాలికి రేవంత్ సర్కారు కీలక బాధ్యతలు.. హెచ్‌జీఎల్ ఎండీగా..!