Nalgonda MP Ticket: నల్గొండ ఎంపీ అభ్యర్థిగా పోటీలో కోమటిరెడ్డి కూతురు శ్రీనిధి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nalgonda MP Ticket: నల్గొండ ఎంపీ సీటుపై కాంగ్రెస్ నాయకులు కసరత్తు మొదలైంది. తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల ఊపు కనిపిస్తోంది. మరికొద్ది నెలల్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ కోసం నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నల్గొండ ఎంపీ సీటుకు ఇప్పటికే నల్గొండ సీటు కోసం జానారెడ్డి కుమారుడు రఘు వీర్ దరఖాస్తు చేసుకోగా.. తాజాగా భువనగిరి టికెట్ కోసం కోమటిరెడ్డి పవన్ దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఈరోజు నల్గొండ ఎంపీ సీటు నుండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూతురు శ్రీనిధి బరిలో ఉండే ఛాన్స్ ఉందని సమాచారం.
Read also: IAS Amrapali: ఐఏఎస్ అమ్రపాలికి రేవంత్ సర్కారు కీలక బాధ్యతలు.. హెచ్‌జీఎల్ ఎండీగా..!
Also Read
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
- Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ, భువనగిరి లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. నల్గొండ నుంచి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీలుగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో జరగనున్న ఎన్నికల్లో తమ సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకునేందుకు బలమైన అభ్యర్థుల కోసం కాంగ్రెస్ అధిష్టానం కూడా కసరత్తు చేస్తోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ నేతల చూపు నల్గొండ ఎంపీ సీటుపై పడినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం నల్గొండ ఎంపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి కూతురు శ్రీనిధి పోటీలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోమటిరెడ్డి కుటుంబం నుంచి భువనగిరి టికెట్ కోసం పవన్ ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. జానా రెడ్డి తనయుడు రఘువీర్ కూడా నల్గొండ సీటుకు దరఖాస్తు చేసుకున్నారు. అంతేకాదు… ఎంపీ సీటు ఇస్తానని పార్టీ హామీ ఇచ్చిందని పటేల్ రమేష్ రెడ్డి చెబుతున్నారు. పటేల్ రమేష్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం. మరి ఎంపీ టిక్కెట్ ఎవరికి దక్కుతుందో చూడాలి.
Ramachandra Reddy: ఎన్నికల సమయంలో ఇదంతా సహజమే.. వేమిరెడ్డి అసంతృప్తిపై పెద్దిరెడ్డి!
తాజావార్తలు
-
October Releases : అక్టోబర్‌లో మూవీ లవర్స్‌కు పండగే పండగ
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!