Site icon NTV Telugu

NGT : తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటి భారీ జరిమానా.. మూడు నెలల్లో చెల్లించాలని ఆదేశం

Ngt

Ngt

NGT : తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్ భారీ జరిమానా విధించింది. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ కేసులో 900 కోట్ల రూపాయల జరిమానాను ఎన్జీటి విధించింది. పర్యావరణ అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్టు నిర్మాణం కొనసాగిస్తూ కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన కేసులో పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మించినందుకు తెలంగాణపై 300 కోట్ల జరిమానా విధించింది. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో పర్యావరణ నష్టపరిహారానికి 528 కోట్ల రూపాయల జరిమానాను విధించింది. డిండి ప్రాజెక్టులో పర్యావరణ నష్టపరిహారానికి 92.8 కోట్ల నష్టం జరిమానా, ఈ జరిమానాలన్నీ మూడు నెలల్లో చెల్లించాలని ఆదేశించింది. జరిమానా మొత్తాన్ని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వద్ద జమ చేయాలని పేర్కొంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పర్యవేక్షణకు కేంద్ర ప్రభుత్వ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది.

Read also: Digvijaya Singh: నేడు దిగ్విజయ్‌తో రేవంత్‌ రెడ్డి వర్గం భేటీ.. మీడియా సమావేశం రేపటికి వాయిదా

ఇక అక్టోబర్‌ 3, 2022న తెలంగాణ సర్కార్‌కు జాతీయ హరిత ట్రైబ్యునల్ భారీ జరిమానా విధించిన విషయం తెలిసిందే.. వ్యర్థాల నిర్వహణలో మార్గదర్శకాలు.. తీర్పులు అమలు చేయకపోవడంపై 3,800 కోట్ల రూపాయల జరిమానా విధించింది. రెండు నెలల్లో ఈ మొత్తాన్ని స్పెషల్ అకౌంట్‌లో జమ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. వ్యర్థాల నిర్వహణపై చర్యలు తీసుకుని, పురోగతి తెలుపాలని సూచించింది. 1996లో మున్సిపాలిటీల్లో పారిశుధ్య , వ్యర్థాల నిర్వహణ సరిగా లేదని పర్యావరణ సురక్ష స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అయితే.. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఎన్.జీ.టీకి బదిలీ చేసింది. దీంతో పిటిషన్‌పై విచారించిన ట్రైబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Dhamaka Movie Controversy : ముగిసిన ధమాకా వివాదం.. క్షమాపణలు చెప్పిన డైరెక్టర్

Exit mobile version