తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్ భారీ జరిమానా విధించింది. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్ కేసులో 900 కోట్ల రూపాయల జరిమానాను ఎన్జీటి విధించింది. పర్యావరణ అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్టు నిర్మాణం కొనసాగిస్తూ కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.