TSPSC Paper Leak Case: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSPSC Paper Leak Case: టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సిట్ల అధికారులు మరో ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రేణుక భర్త డాక్యా నాయక్ నుంచి ఏఈ పేపర్ కొనుగోలు చేసిన కేసులో మరో ఇద్దరిని సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. కోస్గి భగవంత్ కుమార్, కోస్గి రవికుమార్‌లను శుక్రవారం అరెస్టు చేశారు. భగవంత కుమార్ తన తమ్ముడు కోస్గి రవికుమార్ కోసం పేపర్ కొనుగోలు చేసినట్లు సిట్ పోలీసులు గుర్తించారు. దర్యాప్తు అధికారులు ఢాకా నాయక్ బ్యాంకు ఖాతాలపై ఆరా తీస్తున్నారు. అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో కోస్గి భగవంత్ కుమార్ విషయం బయటకు వచ్చింది. కోస్గి భగవంత్ కుమార్ వికారాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో పని చేస్తూ దొరికిపోయాడు. రెండు లక్షలకు ఢాకా నాయక్ నుంచి ఏఈ పేపర్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. వారిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
కాగా..టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో విచారణ దాదాపుగా ముగిసింది. మరికొందరు అనుమానితులను కూడా విచారిస్తున్నారు. నిందితులు ఇప్పటివరకు రూ.33.4 లక్షలు అందుకున్నట్లు సిట్ నిర్ధారించింది. కొందరు నేరుగా నగదు తీసుకుంటే, మరికొందరు తమ బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు అధికారులు గుర్తించారు. పేపర్ లీక్ కావడంతో ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్ కు రూ.16 లక్షలు లభించాయి. రేణుకా రాథోడ్ ప్రవీణ్ కుమార్ ద్వారా రూ.10 లక్షలకు ఏఈ పేపర్ తీసుకున్నారు. ఆ తర్వాత రేణుక భర్త డాక్యా, రాజేశ్వర్ మరో ఐదుగురికి విక్రయించారు. ఈ విక్రయం ద్వారా రాజేశ్వర్, దాఖ్యలకు రూ.27.4 లక్షలు లభించినట్లు సిట్ అధికారులు తేల్చారు. ఇందులో ప్రవీణ్ కుమార్ కు రూ.10 లక్షలు, రాజేశ్వర్, డాక్యాలకు రూ.17.4 లక్షలు మిగిలాయి. డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పేపర్‌ను ప్రవీణ్ కుమార్ ఖమ్మంకు చెందిన దంపతులకు రూ.6 లక్షలకు విక్రయించాడు. ప్రవీణ్ ఈ డబ్బును బ్యాంకులో దాచగా.. సిట్ అధికారులు ఆ డబ్బును స్తంభింపజేశారు. ఆ తర్వాత గ్రూప్-1 ప్రశ్నపత్రాన్ని ప్రవీణ్, రాజశేఖర్ ఉచితంగా ఇచ్చినట్లు విచారణలో తేలింది. ప్రశ్నపత్రాల ద్వారా వచ్చిన డబ్బుతో రాజేశ్వర్ ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు.
Minister KTR: జమ్మూ హెలికాప్టర్ ప్రమాదంలో సిరిసిల్ల వాసి మృతి.. కేటీఆర్ సంతాపం
Also Read
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Kabaddi Tournament : వేములవాడలో కబడ్డీ సందడి.. 33 జిల్లాల నుంచి 68 జట్లు.!
తాజావార్తలు
-
October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
-
SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
-
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
-
BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!