Site icon NTV Telugu

MLA Sanjeeva Reddy: “మా ప్రభుత్వంలో దేనికి గ్యారెంటీ లేదు”.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ఆడియో..

Mla Sangeevreddy

Mla Sangeevreddy

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డికి నియోజకవర్గ ఓటర్ ఫోన్ చేశాడు. దీనికి సంబంధించిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వేసవిలో తాగు నీటి సమస్య తీవ్రంగా ఉందని.. తీర్చాలని ఎమ్మెల్యేని ఓటర్ కోరాడు. త్వరలోనే తాగు నీటి కోసం నియోజకవర్గానికి రూ. 2 కోట్లు వస్తాయని ఎమ్మెల్యే చెప్పారు. ఎప్పుడు వస్తాయని అడిగితే గ్యారెంటీ లేదని సమాధానమిచ్చారు ఎమ్మెల్యే సంజీవ రెడ్డి.

READ MORE: Vijayasai Reddy: లిక్కర్‌ స్కామ్‌లో సాయిరెడ్డి సంచలన ట్వీట్.. వారి పని పట్టండి.. నేను పూర్తిగా సహకరిస్తా..

మీ ప్రభుత్వంలో దేనికి గ్యారెంటీ లేదని ఓటర్ ప్రశ్నించగా.. అవును మా ప్రభుత్వంలో దేనికి గ్యారెంటీ లేదని ఎమ్మెల్యే బదులిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మీరు రాసిచ్చిన బాండ్ కి కూడా గ్యారెంటీ లేదని వ్యక్తి చెప్పడంతో ఎమ్మెల్యే షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది విన్న చాలా మంది నెటిజన్లు ప్రభుత్వం, ఎమ్మెల్యేపై ఫైర్ అవుతున్నారు. హామీలు ఇచ్చేముందు ఆలోచించాలని.. కనీస సౌకర్యాలు సైతం కల్పించకపోతే ఎలా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

READ MORE: Latest Release : ఏప్రిల్ 25న రిలీజ్ కు రెడీగా 15 సినిమాలు.. అరడజనుకు పైగా ఊరు, పేరు లేనివే

Exit mobile version