TSPSC Paper Leak: టీఎస్పీఎస్సీ కేసులో ముగ్గురికి బెయిల్.. నిందుతుల పాస్‌పోర్ట్ సీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSPSC Paper Leak: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో ముగ్గురికి నిందుతులకు బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. రేణుక,డి రమేష్, ప్రశాంత్ రెడ్డి లకు పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. ముగ్గురి నిందుతుల పాస్‌పోర్ట్ సీజ్ చేయాలని పోలిసులకు అదేశాలను జారీ చేసింది. మూడు నెలల వరుకు ప్రతి సోమ, బుధ, శుక్రవారం లో సీట్ కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.
రేణుక, లవుద్యావత్ డాక్యా ప్రధాన నిందితులు
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
టీఎస్పీఎస్సీ కార్యదర్శి ప్రవీణ్ వ్యక్తిగత సహాయకుడు లీకేజీకి కారణమని.. రేణుక, లవుద్యావత్ డాక్యా ప్రధాన నిందితులుగా ఉన్నారు. కాగా… రేణుకాది గండిఎడ్ మండలం మన్సూర్‌పల్లి తండా.. అదే మండలానికి చెందిన డాక్యాది పంచాంగల్ తండా. డాక్యా బీటెక్ పూర్తి చేసి దాదాపు 15 ఏళ్లుగా టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. 2018లో వనపర్తిలోని గురుకుల పాఠశాలలో హిందీ పండిట్‌గా ఉద్యోగం రావడంతో మూడేళ్ల క్రితం రేణుక మహబూబ్‌నగర్‌కు షిఫ్ట్ అయింది. ప్రస్తుతం రేణుక వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం బుద్దారం గురుకులంలో పని చేస్తోంది. అయితే టీఎస్పీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో రేణుక ప్రవీణ్‌తో సన్నిహితంగా మెలిగింది. ప్రవీణ్‌కి ఆమె తన ఫోన్ నంబర్‌ను ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రవీణ్ ఆమెకు తరచూ ఫోన్ చేసేవాడని సమాచారం. ఆ తర్వాత తరచూ కలుసుకునేవారు. ఈ క్రమంలో రేణు పలుమార్లు టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వచ్చింది. TSPSC పేపర్ లీక్ చేయాలని రేణుక, ఆమె భర్త ప్లాన్ చేసుకున్నారు. ప్రవీణ్‌తో రేణుకు ఉన్న సన్నిహిత సంబంధంతో ముగ్గురు కలిసి TSPSC పేపర్‌ను లీక్ చేశారు.
రేణుకతో ప్రశాంత్ రెడ్డి
TSPSC పేపర్ లీక్ కేసులో మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేటకు చెందిన ప్రశాంత్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. టీఎస్పీఎస్సీ పేపర్ లీకర్ నుంచి పేపర్ కొనుగోలు చేసి పరీక్ష రాసినట్లు సిట్ నిర్ధారించింది. రేణుకతో ప్రశాంత్ రెడ్డి ఆర్థిక లావాదేవీలపై పోలీసులు ఆరా తీశారు. ప్రశాంత్ రెడ్డి ఉపాధి హామీ పథకం ఉద్యోగులని గుర్తించారు.
డేటా ఎంట్రీ ఆపరేటర్ రమేష్
టీఎస్పీఎస్సీలో పనిచేస్తున్న అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ షమీమ్, ఔట్ సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ రమేష్ గ్రూప్ 1 పేపర్ లీక్‌ను గుర్తించారు. అయితే ఉన్నతాధికారులకు చెప్పే భయంతో ప్రవీణ్ , రాజశేఖర్ లు షమీ, రమేష్ లను ఎర వేశారు. అలాగే గ్రూప్ 1 పేపర్ ఇస్తారని, మీరు కూడా పరీక్ష రాసి ఉద్యోగం సంపాదించుకోవచ్చని ఆశపడ్డారు. ఆ విధంగా షమీ, రమేష్‌లకు గ్రూప్ 1 పేపర్ కూడా పంపారు. వీరిద్దరూ న్యూజిలాండ్‌లోని ప్రశాంత్‌కు, సైదాబాద్‌కు చెందిన సురేష్‌కు పేపర్‌ను లీక్ చేశారు. కాగా, ఈ ముగ్గురికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేయడం సంచలనంగా మారింది.
Minister Kakani Govardhan Reddy: పవన్‌కు 10 పంటలు చూపిస్తే 5 కూడా గుర్తుపట్టలేడు..
తాజావార్తలు
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!