Panchayat Secretaries: విధులకు డుమ్మా కొట్టి.. క్రికెట్ ఆడుతున్న పంచాయతీ సెక్రటరీలు

  • నల్గొండ: కొందరు పంచాయతీ సెక్రటరీలు విధులకు డుమ్మా.. క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొంటూ ఎంజాయ్ చేస్తున్న సెక్రటరీలు..
  • 4 రోజులుగా విధులకు హాజరుకాని 60 మందికి పైగా సెక్రటరీలు..
  • ఒకవైపు ఎన్నికల కోడ్, మరోవైపు ప్రజాపాలన దరఖాస్తుల పరిశీలన..
  • విధులను గాలికి వదిలేసి ఆటపాటలతో పంచాయతీ కార్యదర్శులు బిజీబిజీ..
Nalgonda

Nalgonda

Panchayat Secretaries: ప్రభుత్వ ఉద్యోగులు అంటే అలసత్వం, నిర్లక్ష్యం, లంచగొండితనం అనే ముద్ర పడింది. తాజాగా, నల్లగొండ జిల్లాలో కొందరు పంచాయతీ సె్క్రటరీలు చేసిన పని కూడా నిర్లక్ష్యానికి నిలువుటద్దం అని చెప్పాలి. అసలు ఏం జరిగిందంటే.. నల్గొండలో అనధికారికంగా కొందరు పంచాయతీ సెక్రటరీలు విధులకు డుమ్మా కొట్టి.. గత రెండు రోజులుగా క్రికెట్ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, నాలుగు రోజులుగా 60 మందికి పైగా పంచాయతీ సెక్రటరీలు విధులకు గైర్హాజరు అయ్యారు. హాలియాలోని ప్రైవేట్ బీఈడీ కళాశాలలో క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొన్నారు.

Read Also: AkankshaSharma : టాలీవుడ్ లో అడుగుపెట్టిన కన్నడ బ్యూటీ

అయితే, స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ఫ్లెక్సీలతో రెండు రోజులుగా క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. అందులో వీళ్లు పాల్గొన్నారు. ఒకవైపు ఎన్నికల కోడ్, మరోవైపు ప్రజాపాలన దరఖాస్తుల పరిశీలనను గాలికీ వదిలేసి ఆట పాటలతో బిజీగా గడుపుతున్నారు ఈ పంచాయతీ సెక్రటరీలు. తీవ్ర విమర్శలకు తావిస్తున్న కొందరు పంచాయతీ సెక్రటరీ లీడర్ల వ్యవహారం. ఇక, పంచాయతీ సెక్రటరీలు విధులకు డుమ్మా కొట్టడం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో తీవ్రంగా మండిపడ్డారు. గైర్హాజరు అయినా అధికారుల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశాలు వెళ్లాయి. విధులకు డుమ్మా కొట్టి.. క్రికెట్ ఆడిన పంచాయతీ సెక్రటరీలకు మెమో జారీ చేసే అవకాశం ఉంది.