Sangareddy: సంక్రాంతి సినిమా అందరికీ గుర్తు ఉంటుంది. ఎందుకంటే కుటుంబ సమేతంగా చూడతగ్గ సినిమా కాబట్టి. అందులో వెంకటేష్ హీరోగా నటించగా.. తల్లిగా శారదా నటించారు. అయితే వెంకటేష్ ఉంటున్న ఇంట్లోకి ఓ దొంగ (కమేడియన్ బేతా సుధాకర్) దొంగతనానికి వస్తాడు. దొంగను పసిగట్టి అందరూ పట్టుకుంటారు. అతను ఆకలి వేస్తుంది అన్నం పెట్టండి అంటే వెంటేష్ తల్లిగా నటించిన శరదా అన్నం తీసుకుని వచ్చి అన్నం పెట్టే సీన్ అప్పట్లో హైలెట్ అనే చెప్పాలి. అలాంటి సీన్‌లు సినిమాకి మాత్రమే పరిమితం అనుకునే వారికి సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘటనే నిదర్శనం.
Read also: CV Anand: వచ్చే ఏడాది నుంచి పద్ధతి మారాలి.. భక్తులకు సీవీ ఆనంద్ విజ్ఞప్తి
నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డి గూడెం గ్రామంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఇళ్లలోకి చొరబడి వరుస చోరీలకు పాల్పడుతున్న గణేష్ అనే దొంగను స్థానికులు పట్టుకున్నారు. కొద్ది రోజులుగా తాళాలు వేసి ఉన్న ఇళ్లపైనే ఇతను టార్గెట్‌గా దొంగతనాలు చేస్తున్నట్టు స్థానికులు గుర్తించారు. వరుసగా దొంగతనాలు జరుగుతుండటంతో దొంగను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు పథకం వేశారు. ఊహించినట్లుగానే స్థానికులు పన్నిన వలలో గణేష్ అనే దొంగ చిక్కాడు. ఇంకేముంది.. పట్టుకున్న వెంటనే ఆగ్రహంతో ఊగిపోయిన యువకులు.. అక్కడ గణేష్‌ను స్తంభానికి కట్టేసి చితకబాదారు. అయితే.. కాసేపటి తర్వాత గణేష్ తనకు ఆకలిగా ఉంటుందని దీనంగా అడగడంతో అక్కడే వున్న యువకుల మనసు కరిగిపోయింది. ఎంత దొంగ అయినా.. ఆకలితో ఉన్నవాడి కడుపు నింపడం ధర్మం అనుకుని.. అప్పటిదాకా కొట్టిన చేతులతోనే దొంగకు అన్నం తినిపించి కడుపు నింపారు.
Read also: Road Accident: తెలంగాణలో వరుస రోడ్డు ప్రమాదాలు.. 5 గురు మృతి, పలువురికి గాయాలు.
అక్కడ ఓ యువకుడు గణేశుడికి నైవేద్యంగా పెట్టే పులిహోరను పళ్లెంలో తెచ్చి స్వయంగా గణేషే (దొంగ)కి తినిపించాడు. ఆ తర్వాత మంచినీళ్లు కూడా తాగించాడు. అనంతరం దొంగ వివరాలను అడిగి తెలుసుకున్నారు. గతంలో కూడా
గణేష్ ఆలయాల్లోని హుండీల నుంచి డబ్బులు దోచుకునేవాడని తెలిపారు. ఆ తర్వాత యువకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వచ్చిన పోలీసులు గణేష్ ను వారికి అప్పగించారు. కోపంలోనూ కరుణ చూపిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఆ యువకులు చూపిన ధర్మాన్ని, మానవత్వాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.
Powerful Dance: నడి రోడ్డుపై డాన్స్ చేసిన హీరోయిన్.. వీడియో వైరల్..