Deputy CM Bhatti: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ లో ఆదివాసి ప్రజా ప్రతినిధుల సాధికారత శిక్షణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీల కోసం చట్టాలు చేసి వాటిని అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఇక, చట్టాలను అమలు చేయించుకునే బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. అలాగే, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత నాది అని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టే.. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు అవుతుంది.. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పకడ్బందీగా ఖర్చు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.
Read Also: Kerala: కేరళలో దారుణం.. టీనేజర్‌పై 64 మంది లైంగిక వేధింపులు..
అలాగే, ఎస్సీ, ఎస్టీలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఒక లక్ష రూపాయలు అదనంగా ఇస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల్లో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే ఉంటారు.. ఒక్క రక్తం చుక్క బయటకు రాకుండా పేదల కోసం తెచ్చిన గొప్ప పథకం ఉపాధి హామీ పథకం.. పోసా చట్టన్ని, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. ఇక, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రైతు బంధు ఉండదని బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసింది.. కానీ, తాము అధికారంలోకి వచ్చాక మారో 2 వేలు అదనంగా కలిపి మొత్తం 12 వేల రూపాయలను ఇవ్వబోతున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.