జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా.. నేడు నగరానికి భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ హైదరాబాద్‌కు రానున్నారు. అయితే దాదాపు 18 ఏళ్ల తర్వాత బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వేదికవుతోంది. పీఎం మోదీ.. అమిత్ షా.. జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులతో పాటు 360 మంది జాతీయ ప్రతినిధులు పాల్గొననున్నారు. కాగా.. రాజకీయ ఆర్థిక తీర్మానాలతోపాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. ఈ సమావేశాలతో పాటు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జూలై 3న నిర్వహించబోయే భారీ బహిరంగసభకు విస్తృత ఏర్పాట్లు చేశారు.
జేపీ నడ్డా ఇవాళ హైదరాబాద్‌కు మధ్యాహ్నం 3 గంటలకు 30 నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆయనకు స్వాగత కార్యక్రమం అనంతరం కిలోమీటరు వరకు రోడ్ షో నిర్వహించి, నేరుగా హైటెక్స్‌కు చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు HICC గొల్లకొండ ప్రాంగణంలో ఎగ్జిబిషన్ ను ప్రారంభిస్తారు. సాయంత్రం 7 గంటలకు జాతీయ ప్రధాన కార్యదర్శులతో సమావేశం, అయితే.. కార్యవర్గ సమావేశంలో చర్చించాల్సిన ముసాయిదా రూపొందించనున్నారు. అధిష్ఠానం ఆదేశాల మేరకు ఇప్పటికే కేంద్రమంత్రులు.. జాతీయ నేతలు రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. రాత్రి 8:30 గంటలకు భరతనాట్యం, శివతాండవం, పేరిణి నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించనున్నారు జేపీ నడ్డా.
జూలై 2వ తేదీన మోదీ , షా తో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది. జులై 2న ఉదయం పదాధికారుల సమావేశం నిర్వహించనున్నారు. అదే రోజున సాయంత్రం 4 గంటల నుంచి మరుసటి రోజు 3వ తేదీ సాయంత్రం 5 వరకు జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగనున్నాయి. అంతేకాకుండా.. 3న సాయంత్రం పరేడ్‌గ్రౌండ్స్‌లో ప్రధాని మోదీ బహిరంగ సభ నిర్వహించన్నారు. కాగా తుది సన్నాహాలపై సమీక్షించేందుకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్ చుగ్, ఇతర నేతలు శనివారం హైదరాబాద్‌కు చేరుకునే అవకాశం ఉంది.
IND Vs ENG: నేటి నుంచి ఐదో టెస్ట్.. టెస్టుల్లో తొలిసారిగా ఆటగాళ్ల నెత్తిపై కెమెరా