ప్రజా సంగ్రామ యాత్రను ఆపే ప్రశక్తి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో సీఎంఓ ఆదేశాలతో అరెస్ట్ చేయడం పై నిరసన దీక్షలు జరుగుతున్నాయని అన్నారు. కుంటి సాకులతో అర్థం పర్థం లేని ఆరోపణలుతో సంగ్రామ యాత్ర కు నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు. ప్రజల్ని కలవాల్సిన ముఖ్యమంత్రి వాలని కలవలేదు, పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబం మీద లిక్కర్ స్కామ్ ఆరోపణలు రావడం వల్లనే మమ్మల్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తన బిడ్డను కాపాడుకోవడానికి.. తనను అరెస్ట్ చేసి డైవర్ట్ చేస్తున్నాడని మండిపడ్డారు. కవిత ఇంటి దగ్గర బీజేపీ వాళ్ళను కొట్టారని, అన్ని దందాల్లో వారే ఉన్నారని తెలిపారు. ఎక్కడ ఐటి దాడులు చేసిన వారి పేరే వస్తుందని ఆరోపించారు. అన్ని అక్రమ వ్యాపారాల్లో కేసీఆర్ కుటుంబం పేరే ఉంటుందని తెలిపారు. 1400 మంది చనిపోతే ఆశవాల మంట మీద ముఖ్యమంత్రి చలి కాచుకుంటున్నాడని తెలిపారు.
రెండు రోజులు పాటు మత ఘర్షణలు చేయడానికి ముఖ్యమంత్రి సన్నాహాలు చేస్తున్నాడని ఆరోపించారు. ఎంఐఎం తో కలిసి కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. బీజేపీకి మైలేజ్ తగ్గించాలని మత ఘర్షణ ప్లాన్ చేస్తున్నాడని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని, బీజేపీ మీద దాడులు చేయాలని చెబుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగ బద్దంగా ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న, అక్రమ వ్యాపారాలు అడ్డగోలు దండాలపై ప్రశ్నిస్తున్నా.. ప్రజలని చైతన్యపరుస్తున్నందుకు ఆపాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగ్రామ యాత్ర ఆపే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే చేతులకు రాడ్డులు ఇస్తున్నారని, ఎమ్మెల్యే కొడుకులకు కర్రలు ఇచ్చి పురిగొల్పుతున్నారని, ప్రజలు తిరగపడ్డా.. అయినా సిగ్గు రావటం లేదని తీవ్రంగా ఆరోపించారు.
Bharat Jodo Yatra: భారత్ జోడో పాదయాత్ర.. తెలంగాణ నుంచి బల్మూరి వెంకట్ కు చోటు