Mp Santhosh Kumar: ఎంపీ సంతోష్ కుమార్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు అందుకున్నారు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్. నిత్యం సోషల్ మీడియాలో ఆయన యాక్టివ్ గా వుంటారు. తన కెమెరా కన్నులతో బంధించిన అందమైన పక్షులు, జంతువుల ఫోటోలను ప్రతీ ఆదివారం వీక్లీ డోస్ ఆఫ్ మై ఫోటోగ్రఫీ పేరుతో ట్విట్టర్ ద్వారా షేర్ చేసే ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఈ వారం మరో ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. హాపీ సండే అంటూ నవ్వుతున్న ఇమోజీని పోస్ట్ చేశారు.
ఆదివారం ఉదయం ఒక కొమ్మపై ప్రశాంతంగా పక్షి కూర్చన్న పోటోను తన కెమారాలో బంధించారు జోగినిపల్లి సంతోష్ కుమార్. లేత ఆకుపచ్చ.. పసుపుతో రంగు.. తన కళ్లు ఎరుపు రంగు..ఉదయాన్నే లేచి చూస్తే.. మబ్బులు తెరతీసే వెలుతురులా వున్నా ఆపక్షిని చూస్తే ఆనందంగా అనిపించేలా వున్న ఆపక్షిని చూసి ఆయన ఇక వెంటనే తన కెమెరాతో దానిని బంధించారు. అటు ఇటు చూస్తూ ఎవరైనా తనని చూస్తారేమో అన్నట్లు కంగారు పడుతూనే ఆ ప్రకృతిని ఆనందిస్తున్న ఫోటోలను జోగినిపల్లి సంతోష్ కుమార్ కెమరాలో బందించారు. దానిని అందరితో పంచుకునేందుకు ట్వీట్ చేస్తూ ఆదివారం ఆనందంగా వుండాలని.. వీకెండ్ డేస్ లో ఇది నాఫోటోగ్రఫీ అంటూ ట్వీట్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు అవి చూసి సండేను ఎంజాయ్ చేయండి మరి..
“Weekly dose of my #Photography 📷 ”.
Have a #HappySunday😊.#Birds #Nature #BirdWatching#BirdPhotography pic.twitter.com/ze1rppJ7ic
— Santosh Kumar J (@MPsantoshtrs) October 23, 2022