TS EAMCET: నేటి నుంచి ఎంసెట్ పరీక్షలు.. ఈ సారి కొత్త రూల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS EAMCET: తెలంగాణలో ఫార్మసీ, మెడికల్, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష (EAMCET) కోసం సర్వం సిద్ధమైంది. నేటి నుంచి (మే 10) పరీక్షలు ప్రారంభమై మే 14 వరకు కొనసాగనున్నాయి. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అగ్రికల్చర్, మెడికల్ ప్రవేశ పరీక్షలు మే 10, 11 తేదీల్లో, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు మే 12, 13, 14న జరగనున్నాయి. JNTU హైదరాబాద్ MSET నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసింది. TS EAMCET కోసం 3,20,384 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. మే 10, 11 తేదీల్లో నిర్వహించే ఏఎం స్ట్రీమ్ పరీక్షకు మొత్తం 1,14,981 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, మే 12, 13, 14 తేదీల్లో జరగనున్న ఇంజినీరింగ్ పరీక్షకు 2,05,031 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. తెలంగాణలోని 104 కేంద్రాలు, ఆంధ్రప్రదేశ్‌లోని 33 కేంద్రాల్లో అధికారులు ఏర్పాటు చేశారు. గతంలో కంటే కొత్తగా 28 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టిక్కెట్లు ఇప్పటికే విడుదలయ్యాయి. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్‌లను ఇప్పటికే https://eamcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
రూల్స్ ఇవే..
Also Read
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
>> ఎంసెట్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమ ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలని కన్వీనర్ డీన్ కుమార్, కో-కన్వీనర్ విజయకుమార్ రెడ్డి తెలిపారు.
>> అభ్యర్థులు తమ ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీకి సంబంధించిన ఒకటి లేదా మరొక ఒరిజినల్ కార్డ్‌ని తీసుకెళ్లాలని సూచించారు. జిరాక్స్‌లను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని అధికారులు తెలిపారు.
>> అదే సమయంలో ఈ పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. గంటన్నర ముందుగా పరీక్షా కేంద్రాలకు రావాలని సూచించారు.
>> పరీక్ష రాసే విద్యార్థుల బయోమెట్రిక్‌లు చేయనున్నారు. దీంతో గోరింటాకు, ఇతర డిజైన్‌లు చేతిలో ఉంటే బయోమెట్రిక్ వేసేందుకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
>> విద్యార్థులు కాలిక్యులేటర్లు, గణితం, లాగ్ టేబుల్స్, స్మార్ట్ ఫోన్లు, రిస్ట్ వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష హాలులోకి అనుమతించబోమని అధికారులు తెలిపారు.
Telangana 10th results: నేడే టెన్త్ రిజల్స్ .. ntvtelugu.com లో చెక్ చేసుకోండి
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!