Warangal: బిడ్డకు పాలిస్తూ హార్ట్ఎటాక్ తో తల్లి మృతి.. మరి బిడ్డ పరిస్థితి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Warangal: ఇటీవలి కాలంలో ఆరోగ్య సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మహమ్మారి నుండి చాలా మంది అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందులో గుండెపోటు ఒకటి. ఈ గుండెపోటు సాధారణంగా కార్డియోవాస్కులర్ సమస్య. ఈ సమస్యతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పురుషుల కంటే మహిళలే ఎక్కువగా గుండెపోటుతో బాధపడుతున్నారు. వరంగల్ లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. నెలల బిడ్డకు పాలిస్తూ తల్లి గుండె నొప్పి రావడంతో అక్కడికక్కడే కుప్పలిన ఘటన అందరికి షాక్ కు గురిచేసింది.
Read also: Minister KTR: ఇక ట్రాఫిక్ జామ్ లుండవు.. స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించిన కేటీఆర్..
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
- Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
- CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్తోనే పోటిపడుతున్నాం..
వర్ధన్నపేట మండలం ఇల్లందు గ్రామానికి చెందిన సుస్మిత ఈ నెల 13న ప్రసవం కోసం వరంగల్ సీకేఎం ఆస్పత్రిలో చేరింది. ఈ నెల 16న ఆమె ఆరోగ్యవంతమైన మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, శిశువుకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆసుపత్రిలోని నియోనాటల్ కేర్ యూనిట్ (SNCU)లో చేర్చారు. శిశువుకు అక్కడ చికిత్స చేయిస్తుండగా, సుస్మిత సీమాంక్ వార్డులో శిశువుకు పాలిచ్చేది. ఎప్పటిలాగే శుక్రవారం (ఆగస్టు 18) తెల్లవారుజామున 4 గంటలకు ఎస్ఎన్సీయూలో బిడ్డకు పాలుపట్టింది. ఆ తర్వాత పక్క వార్డులో నిద్రిస్తున్న ఆమెకు ఉదయం 6 గంటలైనా లేవలేదు. కుటుంబ సభ్యులు తట్టిలేపినా సుస్మిత స్పందించలేదు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే వైద్యులకు సమాచారం అందించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమెకు గుండెపోటు వచ్చినట్లు గుర్తించారు. వెంటనే సీపీఆర్ చేసి బతికేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. తొలి ప్రసవంలోనే మగబిడ్డకు జన్మనిచ్చిన సుస్మిత.. తల్లి చనిపోవడంతో ఆ రోజంతా పాప తల్లి ప్రేమను కోల్పోయింది. పాలకోసం గుక్కపట్టి ఏడ్చిన తల్లికి వినపించినా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. బిడ్డ ఏడుస్తుండటంతో ఓదార్చడం ఎవరి తరం కాలేదు. దీంతో కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా కన్నీరుమున్నీరయ్యారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..