MosChip: హైదరాబాద్ టెక్ కంపెనీ ‘మాస్ చిప్’ ప్రత్యేకతేంటి?
MosChip: హైదరాబాద్‌లోని టెక్నాలజీ కంపెనీ ‘మాస్ చిప్’.. 52 కోట్ల రూపాయలకు పైగా ఆదాయాన్ని నమోదుచేసింది. గత నెలతో ముగిసిన త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. నిరుడు ఇదే టైమ్‌లో ఈ సంస్థ 39 కోట్లకు పైగా మాత్రమే రెవెన్యూని ఆర్జించింది. దీంతో పోల్చితే ఈసారి 33 శాతం అధిక ఆదాయాన్ని సొంతం చేసుకుంది. అయితే.. రెవెన్యూ పెరిగినప్పటికీ నికర లాభం మాత్రం తగ్గిందని మాస్ చిప్ పేర్కొంది. నెట్ ప్రాఫిట్.. కోటీ 60 లక్షల రూపాయల నుంచి కోటీ 24 లక్షలకు పడిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి 6 నెలలకు సంబంధించి 95 కోట్ల రూపాయల ఆదాయాన్ని, 2.79 కోట్ల లాభాన్ని ప్రకటించింది.
CM Jagan: సీఎం జగన్‌తో దర్శకుడు రాంగోపాల్ వర్మ భేటీ.. కారణం ఇదేనా?
Also Read
ఈ నేపథ్యంలో అసలు ఈ సంస్థ ప్రత్యేకత ఏంటి అనే ప్రశ్న తలెత్తుతోంది. 1999లో స్థాపించిన ఈ కంపెనీ.. మొట్టమొదటి ఫ్యాబ్‌లెస్ సెమీ కండక్టర్ సంస్థ. ఇండియాలో పబ్లిక్ ట్రేడింగ్‌లో 20 ఏళ్లకు పైగా అనుభవం దీని సొంతం. సిస్టమ్ డిజైన్ కంపెనీగా కూడా వ్యవహరిస్తోంది. టర్న్‌కీ ఏఎస్‌ఐసీలు, మిక్స్‌డ్ సిగ్నల్ ఐపీ, సెమీకండర్ అండ్ ప్రొడక్ట్ ఇంజనీరింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సొల్యూషన్స్ అందిస్తోంది. ఏరోస్పేస్, డిఫెన్స్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్, మెడికల్, నెట్‌వర్కింగ్, టెలీకమ్యూనికేషన్స్ తదితర రంగాలకు తన ఉత్పత్తులను సరఫరా చేస్తోంది.
ఈ కంపెనీలో 600 మందికి పైగా ఇంజనీర్లు పనిచేస్తున్నారు. ట్రస్ట్, ట్రాన్స్‌పరెన్సీ, టీమ్ వర్క్‌తో ఎంప్లాయీ ఫస్ట్ వర్క్ ఎన్విరాన్‌మెంట్‌ను క్రియేట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు జీతాలు పెంచటం వల్ల సంస్థకు ఖర్చు పెరిగి లాభాలు తగ్గినట్లు పేర్కొంది. సంక్లిష్టమైన సమస్యలకు సింపుల్‌గా సొల్యూషన్స్ చూపెడతామని, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్‌లో గ్లోబల్ లీడర్‌గా గర్వంగా చెప్పుకుంటోంది.
తాజావార్తలు
-
Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
-
Moringa Chutney Recipe: క్షణాల్లో కారం కారంగా మునగ చట్నీ తయారు చేయండి.. రుచితో పాటు పుష్కలమైన విటమిన్లు మీ సొంతం!
-
Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
-
Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్‌ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి
-
KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!