Drunk And Drive: వామ్మో.. ఒక్కరోజుకే ఇన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drunk And Drive: రాజధాని హైదరాబాద్ నగరంలో నూతన సంవత్సర వేడుకలను అంబరాన్నంటాయి. పలువురు కుటుంబ సమేతంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోగా, మరోవైపు హోటళ్లు, పబ్‌లు, రిసార్ట్స్‌లో యువతరం ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు అబ్బురపరిచే కార్యక్రమాలు నిర్వహించారు. అర్ధరాత్రి దాటే వరకు రోడ్లపై తిరుగుతూ పటాకులు కాల్చి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. అయితే పోలీసులు ముమ్మరంగా డ్రంక్ డ్రైవ్ (డ్రంక్ అండ్ డ్రైవ్) తనిఖీలు నిర్వహించి డ్రగ్స్ బానిసలను పట్టుకున్నారు. హైదరాబాద్, సాయిబారాబా కమిషనరేట్ల పరిధిలో 2700కు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో హైదరాబాద్‌లో 1500 కేసులు, సైబరాబాద్‌లో 1241 కేసులు నమోదయ్యాయి.
Read also: New Year 2024: వామ్మో.. హైదరాబాదీలు అన్ని లక్షల కేజీల చికెన్ ను కుమ్మేశారా?
Also Read
రాచకొండలో 517 కేసులు నమోదయ్యాయి. మొత్తం మూడు కమిషనరేట్ల పరిధిలో 3500లకు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. సైబరాబాద్ పరిధిలో ఇద్దరు మహిళలు సహా మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 1239 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపిన కేసుల్లో 938 బైక్‌లు, 21 ఆటోలు, 275 కార్లు, 7 భారీ వాహనాలను సీజ్ చేశారు. పలుచోట్ల వాహనదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మరోవైపు జంటనగరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు. నగరంలోని ఫ్లై ఓవర్లు, ఓఆర్‌ఆర్‌లను ఆదివారం రాత్రి 8 గంటలకు మూసివేశారు. PV ఎక్స్‌ప్రెస్‌వేలో ఫ్లైట్ టికెట్ ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తారు.
Gujarat : ముగ్గురు పిల్లలతో రైలుకింద దూకి ఆత్మహత్య చేసుకున్న తండ్రి
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!