Moinabad Drug Case : మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో కొనసాగుతున్న విచారణ..
- అసైన్డ్ భూమిపై ఫామ్ హౌస్ నిర్మాణం.. బయటపడిన నిజాలు
- రెవెన్యూ విచారణలో సంచలన అంశాలు
- లగ్జరీ కార్లు సీజ్.. విచారణ వేగవంతం
- ఫామ్ హౌస్ సీజ్‌కు సిద్ధమవుతున్న అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన మొయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. అజీజ్ నగర్‌లోని సర్వే నెంబర్ 177/33 పరిధిలో ఉన్న సుమారు 2.20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఫామ్ హౌస్ పూర్తిగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూమిలో కట్టినట్లు రెవెన్యూ అధికారులు జరిపిన విచారణలో నిర్ధారణ అయ్యింది. 2006లో ఈ భూమి రోహిత్ రెడ్డి తండ్రి విఠల్ రెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్ అయినట్లు రికార్డులు చెబుతున్నప్పటికీ, భూభారతి రికార్డుల ప్రకారం అది జంగయ్య అనే వ్యక్తి పేరు మీద ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అసలు ప్రభుత్వానికి చెందిన అసైన్డ్ భూమిపై రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందనే అంశంపై ప్రస్తుతం రెవెన్యూ , పోలీస్ యంత్రాంగం లోతుగా ఆరా తీస్తోంది.
Also Read
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
ఈ అక్రమ నిర్మాణంపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసిన రెవెన్యూ శాఖ, ఫామ్ హౌస్‌ను సీజ్ చేయాల్సిందిగా ఇప్పటికే అధికారులకు నివేదిక అందించింది. పోలీసుల విచారణలో భాగంగా ప్రస్తుతం ఈ ఫామ్ హౌస్ వారి కస్టడీలోనే ఉంది. అక్కడికి పార్టీ కోసం వచ్చిన వారి విలాసవంతమైన వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఐదు లగ్జరీ కార్లను (డిఫెండర్, వోల్వో, ఫోక్స్ వ్యాగన్, బెంజ్, రేంజ్ రోవర్) సీజ్ చేసి, ఆ సమాచారాన్ని కోర్టుకు నివేదించారు. పార్టీకి హాజరైన వారు తమ వాహనాలను అక్కడే వదిలేసి వెళ్లడంతో పోలీసులు వాటిని సీజ్ చేసి విచారణను వేగవంతం చేశారు. త్వరలోనే ఈ ఫామ్ హౌస్ సీజ్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!