Moinabad Episode: తొలిరోజు ముగిసిన నిందితుల కస్టడీ.. 7 గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Moinabad Episode Accused First Day Custody Ended: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుల్ని పోలీసులు కస్టడీకి తీసుకోవడంతో పాటు విచారణ కోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలోనే తొలిరోజు కస్టడీలో భాగంగా.. సిట్ బృందం ముగ్గురు నిందితుల్ని ప్రశ్నించింది. రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్‌లను విడివిడిగా వేర్వేరు గదుల్లో ఉంచి విచారించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో.. ఎవరు ప్రలోభాలకు చేస్తే ఇక్కడికి వచ్చారని అధికారులు ప్రశ్నించారు. ఆ నిందితుల వెనుక ఉన్నది ఎవరని ఆరా తీశారు. ఈ విచారణ సమయంలో.. నిందితుల ముందు వారి కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్‌లను ఉంచారు. శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, రాజేంద్ర నగర్ ఏసీపీ గంగాధర్, మొయినాబాద్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ఈ విచారణ కొనసాగింది. ఏడు గంటల పాటు సాగిన ఈ విచారణలో నిందితుల ముందు పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఒకే ప్రశ్నను ముగ్గురికి వేసి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేయగా.. కొన్ని ప్రశ్నలకు ముగ్గురు వేర్వేరు సమాధానాలు చెప్పినట్టు తేలింది.
ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు రామచంద్ర భారతి కావడంతో.. అతని కేంద్రంగా పోలీసులు విచారణ చేపట్టారు. అతని చరిత్ర గురించి ఆరా తీశారు. ఈ క్రమంలోనే.. ఢిల్లీ, హర్యానాలో స్వచ్చంద సంస్దల పేరుతో పలు కార్యకలాపాలను రామచంద్రభారతి నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. పూజల పేరుతో అతను పలువురు నేతలకు దగ్గరైనట్లు వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్ర, గోవాలో ప్రభుత్వాలను కులగొట్టినట్టు.. రామచంద్ర భారతి ఆడియో టేప్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే! అందులో ఢిల్లీలోనూ త్వరలో సర్కార్ కూలుతుందని అతను చెప్పాడు. ఆ విషయాలపై కూడా అధికారులు ఆరా తీశారు. అతని పరిచయాలపై, అలాగే వందల కోట్ల డబ్బులను ఎక్కడి నుండి తెస్తున్నారని రామచంద్ర భారతిని ప్రశ్నించారు. అయితే.. ఈ విచారణలో నిందితులు పూర్తిగా సహకరించలేదని తేలింది. కొన్ని ప్రశ్నలకు పొంతన లేని సమాధానలు ఇవ్వగా.. మరికొన్ని ప్రశ్నలకు మౌనం పాటించారు. రామచంద్ర భారతి కూడా కొన్ని ప్రశ్నలను దాటవేసినట్టు తేలింది. దీంతో.. రేపు ఉదయం మరోసారి నిందితుల్ని విచారించి, వారి నుంచి సమాధానం రాబట్టాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Also Read
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!