NTV Telugu Site icon

BJP MP K. Laxman: మూడో సారి మోదీ మళ్ళీ ప్రధాని కాబోతున్నారు..

Bjp Mp K Laxamn

Bjp Mp K Laxamn

BJP MP K. Laxman: ఎన్నికల ముందే కాంగ్రెస్ కాడ ఎత్తేసిందని, మూడో సారి మోదీ మళ్ళీ ప్రధాని కాబోతున్నారని బీజేపీ ఎంపీ డాక్టర్ K.లక్ష్మణ్ అన్నారు. బీజేపీ కన్వెన్షన్ లో దేశ వ్యాప్తంగా ప్రతినిధులు పాల్గొన్నారన్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ అగ్రనాయకత్వం దిశానిర్దేశం చేశారన్నారు. రానున్న వంద రోజుల్లో బీజేపీ కార్యాచరణను స్పష్టం చేశారన్నారు. బీజేపీ 370 స్థానాలు రానున్న ఎన్నికల్లో గెలవనుందన్నారు. ఎన్డీయే తో కలిపి 400 సీట్లకు పైగా గెలవటం ఖాయమన్నారు. ఎన్నికల ముందే కాంగ్రెస్ కాడ ఎత్తేసిందన్నారు. మూడో సారి మోడీ మళ్ళీ ప్రధాని కాబోతున్నారన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికలు మహాభారత యుద్ధమన్నారు. విపక్షాలు కౌరవ సైన్యంగా ఉంటే వాళ్ళను మోడీ నేతృత్వంలో బీజేపీ గెలుపు ఖాయమన్నారు. రాహుల్ భారత్ జోడో కాదు కాంగ్రెస్ జొడో చేపడితే కరెక్ట్ అన్నారు. ఇండియా కూటమి నుంచి పార్టీలు బయటకు వస్తున్నాయన్నారు. మోడీ అభివృద్ధికి ప్రజలు పట్టం కడుతున్నారని తెలిపారు.

Read also: IND vs ENG: మేం అయోమయానికి గురయ్యాం.. ఎవరినీ బ్లేమ్ చేయడం లేదు: బెన్‌ స్టోక్స్

తెలంగాణలో బీఆర్ఎస్ ను మార్చాలనే మార్పుతో కాంగ్రెస్ గెలిచిందన్నారు. కాంగ్రెస్ పెట్టిన బడ్జెట్ కు పాలనకు పొంతన లేదన్నారు. ఆరు గ్యారంటిల అమలు గందరగోళంగా ఉందన్నారు. మసిపూసి గారడీ చేసి పార్లమెంట్ ఎన్నికల్లో గట్టెక్కేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ నీ ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ లు రహస్య ఒప్పందంతో ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. కొట్టినట్టు చేస్తే, ఏడ్చినట్టు అన్నట్లు నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అవినీతి పై చర్యలేవి? అని ప్రశ్నించారు. రేవంత్ కు బీఆర్ఎస్ తో ఢీ కొట్టాలని ఉన్నా.. ఢిల్లీ పెద్దలు రహస్య ఒప్పందం చేసుకున్నారని అన్నారు. అన్ని విషయాలు ప్రజల్లోకి తీసుకువెళతామన్నారు. బీజేపీ ఎన్నడైనా బీఆర్ఎస్ తో పోటిచేసిందా? అని ప్రశ్నించారు. సిట్టింగ్ ఎంపీలు సైతం మాతో టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కేసు ఈడి విచారణ చేస్తోందన్నారు. తప్పు చేసిన వాళ్లపై చర్యలు తీసుకుంటారన్నారు.

Read also: Amethi: ఒకే రోజు అమేథిలో స్మృతి ఇరానీ వర్సెస్ రాహుల్ గాంధీ..

మేడిగడ్డ ప్రాజెక్ట్ పై కేంద్రం ఇచ్చిన నివేదిక పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? అని ప్రశ్నించారు. బీఆర్ ఎస్ మునిగిపోయిన పడవ అన్నారు. ఆధారాలు ఉంటే ఈడి వదలదన్నారు. కవిత కేసు విషయంలో విచారణ జరుగుతోందన్నారు. లిక్కర్ కేసులో అరెస్టయిన వాళ్లకు కోర్టులు బెయిల్ ఇవ్వడం లేదంటే ఆధారాలు ఉన్నట్లే అన్నారు. మాకు పక్షం, పాతమ్ అంటూ ఏం లేదన్నారు. కాళేశ్వరం విషయంలో సీబీఐ విచారణ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. 17 సీట్లలో బీజేపీ పోటీ చేస్తుందన్నారు. బీఆర్ఎస్ తో పొత్తు లేదు, పార్లమెంట్ బోర్డ్ మెంబర్ గా చెప్తున్నా అన్నారు. వాళ్ళు కాళ్ళ బేరానికి వచ్చినా పొత్తు ఉండదన్నారు. ఆంధ్రలో పొత్తులపై అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. ఏపి లో జనసేన తో పొత్తు ఉందన్నారు. 17 సీట్లలో బీజేపీ పోటీ చేస్తుందన్నారు. బీఆర్ఎస్ తో పొత్తు లేదు, పార్లమెంట్ బోర్డ్ మెంబర్ గా చెప్తున్నా అన్నారు. వాళ్ళు కాళ్ళ బేరానికి వచ్చినా పొత్తు ఉండదన్నారు. ఆంధ్రలో పొత్తులపై అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు.
Fatty Liver Ayurvedic Remedies: ఫ్యాటీ లివర్‌ను నివారించే అద్భుత ఆయుర్వేద చిట్కాలు ఇవే..!