Medaram Jathara: ములుగు జిల్లాలోని మేడారంలో ప్రతి రెండేళ్లకోసారి మాఘమాసంలో జాతర జరుగుతుంది. ఈ నెల 21 నుంచి 24 వరకు జరిగే జాతరకు రూ. 110 కోట్లు కేటాయించిన ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. మంత్రి సీతక్క ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వనదేవతల రాకకు నెల రోజుల ముందే భక్తులు లక్షల్లో పోటెత్తారు. బంగారంగా కొలిచే బెల్లం కానుకగా సమర్పించి పూజలు చేస్తారు. మహాజాతరకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉండడంతో అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే జంపన్నవాగు నీటితో నిండిపోయింది. ఈ నెల 14న అధికారులు లక్నవరం చెరువు గేట్లను తెరిచి సద్ది కుంట చెరువుకు నీటిని విడుదల చేశారు. అయితే.. మేడారం జాతర సందర్భంగా నేటి నుంచి లక్నవరం సందర్శన నిలిపివేశారు. నేటి నుంచి 26 వరకు లక్నవరంలో పర్యాటకులకు అనుమతి నిరాకరించనున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీ, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సందర్శన నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
Read also: Pakistan: పాక్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లీయర్.. భుట్టో షరతులకు నవాజ్ అంగీకారం..
17వ తేదీ సాయంత్రం సద్దిమడుగు తూములు తెరవడంతో దయ్యాల వాగు ద్వారా ముట్లగూడెం గ్రామాల సమీపంలోని జంపన్న వాగులోకి ప్రవహిస్తూ మేడారం వద్దకు నీళ్లు చేరాయి. నాలుగు చెక్ డ్యాంలను నీటితో నింపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జంపన్నవాగులో భక్తులు స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. మేడారం జాతరకు ప్రజలు సహకరించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నెల 18 నుంచి 25 వరకు 8 రోజుల పాటు ఆర్టీసీ 6 వేల ప్రత్యేక బస్సులను నడుపుతోంది. గతంలో నడిచిన బస్సుల కంటే ఈసారి జాతరకు ఎక్కువ బస్సులు వెళ్తున్నందున రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సాధారణ ప్రయాణికులకు కొన్ని బస్సులు తగ్గే అవకాశం ఉందన్నారు. ప్రజలు అసౌకర్యానికి గురికావద్దని కోరారు.
Ranchi Test: ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు.. టీమిండియా స్టార్ ప్లేయర్ దూరం!