అతి తక్కువ ఖర్చుతో నగరంలో ప్రయాణించే రోజులు దగ్గరకు వచ్చాయి. ఈనెల 8న హైదరాబాద్ కు రానున్న ప్రధాని మోదీ ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా రైళ్లను ప్రారంభించనున్నారు. దీంతో మేడ్చల్ - సికింద్రాబాద్ - ఉందానగర్, మేడ్చల్ - సికింద్రాబాద్ - తెల్లాపూర్ ఎంఎంటీఎస్ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు.